రామ్ రాజకీయ ప్రవేశం చేయబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. అయినా దీనికి కారణం లేకపోలేదు నిజానికి రామ్ పాలిటిక్స్ గురించి ఎక్కువగా మాట్లాడడు... విమర్శలు చేయడానికి అసలు ఇష్టపడరు. అలాంటి హీరో ప్రస్తుతం సీఎం జగన్ కు సపోర్ట్ గా మాట్లాడటం ఊహాగానాలకు ప్రాణం పోసింది. ఈమధ్య స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో కరోనా బాధితులు ఉన్న సెంటర్ లో జరిగిన అగ్నిప్రమాదం అందరికీ తెలిసిందే. ఇందులో కొంతమంది పేషెంట్లు తమ ప్రాణాలను కూడా కోల్పోయారు, దీంతో ఈ విషయం రాష్ట్రంలో లో ఒక ఉప్పెన లా మారింది.
ఈ ఘటనపై కొంతమంది రాజకీయం ప్రత్యర్థులు ఎటువంటి భద్రతా సదుపాయాలు లేని అటువంటి హోటల్ కి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని, ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు ఇంత మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుందని ఆరోపణలు చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క తప్పిదమేనంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ అవి కొనసాగుతూనే ఉన్నాయి.
లేటెస్ట్ గా ఈ వార్తలపై స్పందించాడు హీరో రామ్ స్వర్ణ ప్యాలెస్ హోటల్ అగ్ని ప్రమాద విషయం లో పెద్ద కుంభకోణమే జరుగుతోంది ఈ సంఘటనకు సీఎం జగన్ ను దోషిగా చూపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు..... వైయస్ జగన్ గారు మీ కింద పని చేసే వాళ్లే మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వలన మీ గౌరవానికి, మీపై మేం పెంచుకున్న నమ్మకానికి మాయని మచ్చ ఏర్పడుతుంది. అలా మీ వెనకే గోతులు తవ్వే వ్యక్తులు ఎవరో తెలుసుకొని వాటిని అరికడతారని ఆశిస్తున్నాం....అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు హీరో రామ్ పోతినేని .
ఇంకేముంది ఈ వార్త విన్న పలువురు సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా ఇలా ప్రజా సమస్యలపై స్పందించడం గొప్ప విషయం అంటూ అభినందిస్తూ ఉంటే.. మరికొందరు ఇప్పటి నుండే వైసిపి పార్టీ లో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నాడంటూ విమర్శిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి