ఇద్దరు అగ్ర హీరోలు కలిసి ఒకే సినిమాలో నటించిన సందర్భాలు చాలానే చూశాం. అయితే ఇప్పుడు ఎవరికి వారే సాటి అన్నట్టుగా ఉండే ఇద్దరు బడా హీరోలు అంతకుమించిన మంచి స్నేహితులు కలిసి మరోసారి మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారు...... వీరు మరెవరో కాదు బాలీవుడ్ సూపర్ స్టార్స్ అయిన షారుక్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్. వీరిద్దరు గతంలో కలిసి ఎన్నో సినిమాలు తీసి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే కాకపోతే ఇప్పుడు రాబోతున్న ఈ సినిమాకి స్పెషాలిటీ ఉంది.
ఎన్నో సినిమాల్లో కలిసి నటించి హిట్స్ అందుకున్న వీరిద్దరి మధ్య గతంలో మనస్పర్థలు వచ్చి వీరి స్నేహం చెదిరిపోయిన సంగతి తెలిసిందే...కొన్నేళ్ల పాటు వీరి మధ్య పూర్తిగా మాటలు లేకుండా పోయాయి. ఆ తర్వాత కొన్నేళ్ళకు ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు.

అలాంటి వీరు తాజాగా మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నారనే వార్త వినపడటంతో వీరి ఫ్యాన్స్ సంతోషంతో సందడి చేస్తున్నారు. వారి అభిమాన తారలు మళ్లీ ఒకే సినిమాలో వెండితెరపై కనిపించబోతున్నారు అన్న వార్త వారిని ఆనందంతో ముంచెత్తింది. అంతే కాదు ఇక్కడ మరో స్పెషల్ న్యూస్ కూడా  ఉంది. జీరో సినిమా ప్లాప్ కావడంతో అప్పటి నుంచి షారుఖాన్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. దాదాపు రెండేళ్లుగా షారుక్ ఖాన్ ఏ సినిమాలో చేయలేదు... చాలా కథలు విన్నా ఒకటి ఆయనకు నచ్చలేదు. అలా రెండు నెలలు గడిచిపోయాయి. అయితే మళ్లీ ఇప్పుడు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు షారుక్. మూడు సినిమాలకు వరుసగా ఓకే చెప్పినట్లు సమాచారం. అందులో ఒకటి ఈ మల్టీస్టారర్ మూవీ కావడం..... ఇద్దరు ఖాన్లు కలిసి మళ్లీ తిరిగి తెరపై కనిపించబోతున్నారనే న్యూస్ ఎంతైనా ఫ్యాన్స్ కి సూపర్ స్పెషల్ మరి.

ముందుగా చూస్తే హీరో షారుక్ పఠాన్ అనే సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు. వార్,  బ్యాంగ్ బ్యాంగ్ మూవీల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. యశ్ రాజ్ ఫిలింస్ నిర్మాణ బాధ్యతలు చేపడుతోంది. దీపికా హీరోయిన్ గాను ... ఈ మూవీలో ఓ ముఖ్య పాత్రలో సల్మాన్ నటించబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం సల్మాన్ ఖాన్ 10 రోజుల పాటు డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. షారుక్ ఖాన్ ఈ మూవీతో పాటు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనుండగా తమిళ ప్రముఖ దర్శకుడు సర్కార్ మెర్సల్ ఫేమ్ అట్లీతో షారూక్సినిమా చేయనున్నట్లు ప్రస్తుత సమాచారం. మొత్తానికి హీరో షారుక్ ఖాన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చి ఫాన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నాడు అన్నమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: