ఒక వైపు పోటీ పెరిగిపోతోంది. మరోవైపు అవకాశాలు తగ్గిపోతున్నాయి. గేమ్‌లో నంబర్స్‌ కూడా ఛేంజ్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో కూడా డిమాండ్ చేస్తే వర్కవుట్ కాదనుకున్నాడో, లేకపోతే తగ్గితే కెరీర్‌కి మరింత జోష్‌ వస్తుంది అనుకున్నాడో ఏమో గానీ, దేవి శ్రీ ప్రసాద్‌ రెమ్యునరేషన్ తగ్గిస్తున్నాడట.

చిన్నసినిమాలకు, మీడియం రేంజ్‌ మూవీస్‌కి దేవిశ్రీ ప్రసాద్‌ని పట్టుకోవడం కష్టం, తెలుగు, తమిళ్, సినిమాలతో బిజీగా ఉండే దేవిని తీసుకోవడం కొంచెం కష్టమని మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒక ఒపీనియన్ ఉంది. కానీ ఇప్పుడు తమన్ వచ్చి ఈ ఒపీనియన్‌ని మార్చేస్తున్నాడట.

ఈ ఏడాది సంక్రాంతికి దేవి శ్రీ ప్రసాద్ 'సరిలేరు నీకెవ్వరు' ఆల్బమ్‌తో వస్తే, తమన్ 'అల వైకుంఠపురములో' ఆల్బమ్ రిలీజ్ చేశాడు. ఈ రెండిటిలో 'వైకుంఠపురము' ఆల్బమ్‌ సూపర్ హిట్ అయ్యింది. దీంతో తమన్‌కి డిమాండ్ పెరిగిపోయింది. చిన్న సినిమాల నుంచి స్టార్‌ హీరోస్‌ వరకు అందరూ తమన్‌నే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తీసుకోవాలనుకుంటున్నారు.

దేవిశ్రీ ప్రసాద్‌ని ఆస్థాన విధ్వాంసుడిలా చూసే కొరటాల శివ కూడా దేవీని పక్కనపెట్టి 'ఆచార్య'కి మణిశర్మని మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తీసుకున్నాడు. దీంతో డీఎస్పీ కొంచెం స్లో అవుతున్నాడు. దీంతో మీడియం రేంజ్‌ మూవీస్‌కి కూడా నేను అందుబాటులో ఉంటాను అన్నట్లు రెమ్యునరేషన్‌ తగ్గిస్తున్నాడట దేవి. మరి ఈ శాలరీ తగ్గించుకుంటే మళ్లీ డీఎస్పీ బిజీ అవుతాడా అనేది చూడాలి.

ఏమని కరోనా వచ్చిందో గానీ.. ఏ ఒక్కరికీ కలిసి రావడం లేదు. ఒకప్పుడు హీరో, హీరోయిన్ లు ఎంత అడిగితే అంత డబ్బులు ఇచ్చే నిర్మాతలు..ఇపుడు అంత సొమ్ము ఇచ్చేందుకు వెనుకడుగేస్తున్నారు. ఒక్క హీరో, హీరోయిన్ లే కాదు.. మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా ఇదే  పరిస్థితి. ఒక్కప్పుడు మంచి డిమాండ్ ఉన్న వాళ్లు సైతం ఇప్పుడు అవకాశాల్లేక ఢీలా పడిపోయారు. ఇక చేసేది ఏమీ లేక రెమ్యునరేషన్ తగ్గించుకునే పనిలో పడ్డారు.



మరింత సమాచారం తెలుసుకోండి: