ప్రస్తుతం టాలీవుడ్‌లో.. బాలీవుడ్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్‌కు యాక్షన్‌ హీరో ఇమేజ్‌ తీసుకొచ్చిన ఛత్రపతి  హిందీ రీమేక్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌ నటిస్తున్నాడు. వినాయక్‌ దర్శకుడు.  మన తెలుగు హీరో ఛత్రపతిని టచ్‌ చేస్తూ.. హిందీలోకి అడుగుపెడుతున్నాడు.

వర్షం  ప్రభాస్‌కు క్రేజీ ఇమేజ్‌ తీసుకొస్తే.. ఛత్రపతి  టాప్‌ స్టార్స్ రేసులో నిలబెట్టింది.  ఒక్క అడుగు అన్న డైలాగ్‌ చాలా అడుగులు వేసేట్టు చేసింది. అన్నపై తమ్ముడి పగ.... మదర్‌ సెంటిమెంట్‌ ... కీరవాణి బ్యాక్‌గ్రౌండ్‌.. ఇలా అన్నీ కలిసి ఛత్రపతిని సూపర్‌హిట్ చేసింది. 15 ఏళ్ల తర్వాత ఛత్రపతి హిందీలో రీమేక్ అవుతోంది.

హిందీ ఛత్రపతిగా బెల్లంకొండ శ్రీనివాస్‌ నటిస్తున్నాడు.ఈ కుర్ర హీరో ప్రభాస్‌ పర్సనాలిటీకి  ఏమాత్రం తీసిపోడు. ఈ యంగ్ హీరో గతంలో చేసినవన్నీ యాక్షన్‌ మూవీసే కాబట్టి.. యాక్షన్‌ సీన్స్‌ చేయడం  పెద్ద కష్టం కాకపోవచ్చు. వినాయక్‌కు కూడా ఇదే ఫస్ట్ హిందీ మూవీ.  చిరంజీవితో లూసిఫర్‌ రీమేక్‌ను వదిలేసుకుని మరీ.. ఛత్రపతిని హిందీలో తీసే సాహసం చేస్తున్నాడు. దర్శకుడిగా తొలి చిత్రం ఆది హిట్టయినట్టే.. అక్కడ కూడా తొలి అడుగులోనే సక్సెస్‌ సాధిస్తాడేమో చూడాలి. 'అల్లుడుశ్రీను'తో వినాయక్‌ చేతుల మీదుగా పరిచయమైన బెల్లంకొండ..  ఆయనతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

ఛత్రపతి హిందీలో రీమేక్ అవుతున్నా.. ఆల్రెడీ ఈ మూవీని హిందీలో 'హుకుమత్‌ కి జంగ్‌' పేరుతో డబ్‌  చేసి నాలుగేళ్ల క్రితమే యు ట్యూబ్‌లో రిలీజ్‌ చేశారు. బాహుబలితో  ఇండియావైడ్‌ పాపులర్‌ కావడంతో... ప్రభాస్ హిందీ  అనువాదాలను బాలీవుడ్‌ ప్రేక్షకులకు చూసేశారు. ఇదొక్కటే కాదు.. ఛత్రపతికి కెజిఎఫ్‌ కూడా మరో ప్రతికూలాంశంగా కనిపిస్తోంది. రెండూ బానిస బతుకుల నేపథ్యంలో తెరకెక్కినవే.

హిందీ ఛత్రపతికి కొన్ని అడ్డంకులు ఉన్నా.. ఇప్పటి జనరేషన్‌కు తగ్గట్టు మార్పులు చేర్పులు చేస్తున్నారట. వినాయక్‌ తనదైన మార్క్‌తో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. యాక్టింగ్‌లో ప్రభాస్‌ను మరిపించాడా? లేదా? అని తెలుగు ప్రేక్షకులు చూస్తారేగానీ. హిందీ ఆడియన్స్‌కు అనవసరం. ఛత్రపతితో తెలుగు హీరో.. దర్శకుడు హిందీలో అదృష్టం పరీక్షించుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: