అదేంటో బాలీవుడ్ హీరోలు ఈ మధ్య.. ముందుగా కమిట్ అయిన ప్రాజెక్ట్ లనుంచి పక్కకు తప్పుకుంటున్నారు. కొన్ని సందర్బాలలో తాము అనుకున్న పాత్రలకు కొందరిని ఎంచుకొని ఆ తర్వాత మళ్లీ వద్దనుకుంటున్నారు. దీంతో ఈక్వేషన్స్  మారిపోతున్నాయి. తాజాగా అలా సైడ్ అయినవారిలో ఇద్దరు హీరోలు ఉన్నారు.

దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్ లోనూ షఫిలింగ్ గేమ్ బాగానే ఆడుతున్నారు. ముందు అనుకున్న నటీనటులు తీరా తమ పార్ట్ షూట్ కు వచ్చేసరికి సైడ్ అయిపోవల్సి వస్తుంది. ఈ ప్రాసెస్ లో కొందరిని కావాలని సైడ్ చేస్తే .. ఇంకొందరు వారంతట వారే సైడ్ అయిపోతున్నారు. ఇంకా బాగా చెప్పాలంటే డ్రాపవుట్ లు పెరిగిపోతున్నాయి. నిజానికి ఈ ఈక్వేషన్ చాలాకాలం నుంచి ఉన్నదే. కాకపోతే ఈ మధ్యకాలంలో ప్రెస్టీజియస్ ఫిలింకు ఎంతో పోటీ మధ్య సెలెక్ట్ అయ్యి.. ఆ తర్వాత సైడ్ అవుతున్న హీరోలెవరు మార్కెట్లో మనకు కనిపించరు. ఇప్పుడు ఇద్దరు బడా హీరోలు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం అనే మాట టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయ్యింది.

బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దాలో ముందుగా ప్రత్యేక పాత్రకు గాను విజయ్ సేతుపతిని తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఏమైందో ఏమో.. కాల్షీట్స్ ఏడ్జెస్ట్ కావని విజయ్ సేతుపతిని సైడ్ చేశాడు. కరెక్ట్ గా ఇదే సమయంలో అమీర్ ఖాన్ చేస్తున్న విక్రమ్ వేద రీమేక్ లో అమీర్ ప్లేస్ లోని హృతిక్ వచ్చి చేరాడు. ఇప్పుడీ విషయం అందరికీ షాక్ ఇస్తుంది.

తాజాగా "సుహేల్ దేవ్"  ప్రాజెక్ట్ తో అక్షయ్ కుమార్ హిస్టారికల్ ప్రాజెక్ట్ లో కనిపించడానికి రెడీ అవుతున్నాడు. అయితే డేట్స్ ఇష్యూనో లేక మరో కారణమో తెలియదుగానీ ఉన్నట్టుండి ఈ ప్రాజెక్ట్ నుంచి పక్కకు తప్పుకున్నాడట. ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్న ఈ సినిమాను అసలు కిలాడి ఎలా వదులుకున్నాడు అని బీటౌన్ లో హాట్ డిస్కషన్ అయితే నడుస్తుంది. బట్ ఎవరికుండే రీజన్స్ వారికుంటాయి కదా. ఇది కూడా ఆ టైపే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: