అదిగో ఇదిగో అంటూ ఊరించిన కెజిఎఫ్‌2 టీజర్‌ను శుక్రవారం ఉదయం 10 గంటల 18 నిమిషాలకు రిలీజ్‌ చేస్తామని ఐదు రోజుల క్రితమే ప్రకటన చేశారు. అయితే.. ఓ ఆకతాయి లీక్ చేసేయడంతో.. గురువారం రాత్రే హుటావుటిన విడుదల చేసేశారు. దీనిపై యశ్‌ స్పందిస్తూ.. 'ఎవరో మహానుభావుడు ముందే రిలీజ్‌ చేసేశాడు. దీంతో ఏం లాభం వచ్చిందో నాకు తెలియదు. దేవుడు అతనికి అంతా మంచే చేయాలంటూ..' వీడియో రిలీజ్‌ చేశాడు యశ్‌.

కేజిఎఫ్‌2 టీజర్‌ ముందే వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇలా వచ్చినా.. టన్నుల కొద్దీ మిలియన్‌ వ్యూవ్స్ వచ్చాయి. 24 గంటల్లో పాత సినిమాలు క్రియేట్‌ చేసిన వ్యూవ్స్‌ రికార్డులన్నింటినీ కెజిఎఫ్‌2 టీజర్‌ బ్రేక్‌ చేసేసింది. ఫస్ట్ పార్ట్‌లో అధీర పాత్రను అసలు చూపించలేదు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. కేవలం సింహపు ఉంగరం ధరించిన వ్యక్తిని మొహం కనిపించకుండా చూపించారు. టీజర్ లో కూడా సంజయ్‌దత్‌ను  బ్యాక్‌ నుంచి మాత్రమే చూపించి సస్పెన్స్‌ మెయిన్‌టేన్‌ చేశాడు దర్శకుడు.

కెజిఎఫ్‌2 రిలీజ్‌ కోసం అధీర రోల్ పోషించిన సంజయ్‌దత్‌ ఎగ్జయిట్‌మెంట్‌గా ఎదురుచూస్తున్నాడు. కెరీర్‌లో చాలా రకాలు పాత్రలు పోషించినా.. అధీర పాత్రను ఎంజాయ్‌ చేస్తూ  నటించానన్నాడు సంజయ్‌దత్‌. అధీరాగా కనిపించడానికి శారీరకంగా చాలా కష్టపడాల్సి వచ్చిందని.. మేకప్‌ వేసుకోవడానికే గంటన్నరకు పైగా పట్టిందన్నారు సంజయ్‌.

సాధారణంగా టీజర్‌ నిమిషమో.. నిమిషంన్నరో ఉంటుంది. కానీ 2 నిమిషాల 16 సెకన్లతో కెజిఎఫ్‌2 టీజర్‌ వచ్చింది. టీజర్‌ లెంగ్తీగా ఉన్నా.. హీరో.. విలన్‌ కనిపించింది తక్కువే. మదర్‌ సెంటిమెంట్‌తో మొదలై.. అమ్మ ప్రామిస్‌తో టీజర్‌ ఎండ్‌ అయింది. మధ్యలో బిల్డప్‌ షాట్స్‌తో రిచ్‌ లుక్‌ తీసుకొచ్చినా.. మధ్యలో అధీరాను వెనకుంచి రెండుసార్లు మాత్రమే చూపించాడు. ఈ రెండు నిమిషాల టీజర్‌లో హీరోను కూడా చివర్లో మాత్రమే చూపించే.. సిగరెట్‌ తాగే సీన్‌తో ఒక్కసారి హైప్‌ తీసుకొచ్చాడు దర్శకుడు. అయితే.. షాట్‌ షాట్‌కు మధ్య వచ్చే బ్లాక్‌ ఛేంజ్‌ ఓవర్‌ ఎక్కువైంది. సాధారణంగా పాన్‌ ఇండియా మూవీ అంటే.. టీజర్‌ను అన్ని భాషల్లో రిలీజ్‌ చేస్తారు. ఆ అవకాశం లేకుండా.. ఇంగ్లీష్‌ వాయిస్‌ ఓవర్‌తో.. అన్ని భాషల్లో ఒకే టీజర్‌ రిలీజ్‌ చేశారు. దీంతో.. ఎక్కువ మిలియన్‌ వ్యూవ్స్‌ వచ్చిన టీజర్‌గా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది ఈ కన్నడ సినిమా. 

మరింత సమాచారం తెలుసుకోండి: