మీడియం రేంజ్‌ హీరోలు ఎక్కువగా టాలీవుడ్‌ గ్రాఫ్‌ గురించే ఆలోచించేవాళ్లు. పక్క మార్కెట్‌ని పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. తెలుగులో మీడియం రేంజ్‌ నుంచి స్టార్‌ లీగ్‌లోకి ఎంటర్‌ అయితే చాలనుకునేవాళ్లు. కానీ ఇప్పుడీ ఆలోచనల్ని మూటకట్టి పక్కనపెట్టేస్తున్నారు. పాన్ ఇండియన్‌ లెవల్‌లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు.

'ఇస్మార్ట్ శంకర్‌' బ్లాక్‌బస్టర్‌తో ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నాడు రామ్‌. ఎనర్జిటిక్ రోల్స్‌తో ఇక్కడ హంగామా చేసే రామ్, ఇప్పుడు ఇండియా వైడ్‌గా ఇమేజ్ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. కిశోర్ తిరుమల డైరెక్షన్‌లో చేసిన 'రెడ్' సినిమాని ఏడు భాషల్లో రిలీజ్ చేస్తున్నాడు. కన్నడ, మళయాళ, హిందీతో పాటు, మరాఠీ, బోజ్‌పురీ, బెంగాళీ భాషల్లోనూ 'రెడ్‌'ని డబ్ చేస్తున్నాడు రామ్.

మాస్‌ మూవీస్‌తో తెలుగునాట స్టార్డమ్ సంపాదించుకోవడానికి ట్రై చేస్తోన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కూడా ముంబాయి వెళ్తున్నాడు. 'ఛత్రపతి' సినిమా రీమేక్‌తో బాలీవుడ్‌ బండెక్కుతున్నాడు బెల్లంకొండ. ఇక ఈ సినిమాని వి.వి.వినాయక్ డైరెక్ట్ చేస్తున్నాడు.

కెరీర్‌ బిగినింగ్‌ నుంచే మార్కెట్‌ పెంచుకోవడానికి ప్రయత్నిస్తోన్న విజయ్‌ దేవరకొండ ఇప్పుడు బాలీవుడ్‌కి వెళ్తున్నాడు. 'నోటా, డియర్ కామ్రేడ్'తో తమిళ, కన్నడ, మళయాళీ మార్కెట్స్‌కి వెళ్లిన దేవరకొండ, ఇప్పుడు 'ఫైటర్‌'తో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు. పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో నార్త్‌లోనూ స్టార్డమ్ సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.

మొత్తానికి యువ హీరోలు ఉత్తరాది మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నారు. బాలీవుడ్ మార్కెట్ లో తెలుగు హీరోలు సందడి చేస్తున్నారు. ఏడు భాషల్లో రామ్ రెడ్ మూవీ రిలీజ్ అవుతోంది. మరాఠీ, బెంగాలీ, బోజ్ పురీ భాషల్లో రెడ్ సినిమా రిలీజ్ కానుండటంతో ఉత్తరాది ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రెడ్ సినిమా ఎక్కడి నుంచో రాలేదు.. తమిళ హిట్ సినిమా తడమ్. తమిళనాట హిట్ కొట్టిన సినిమా కావడంతో మనోళ్లు దాన్ని ఏకంగా బాలీవుడ్ తీసుకెళ్తున్నారు. ఇక బెల్లంకొండ ఛత్రపతి సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. ఇక విజయ్ దేవరకొండ ఫైటర్ మూవీతో బాలీవుడ్ కు వెళ్తున్నాడు.











మరింత సమాచారం తెలుసుకోండి: