ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్  సుకుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో "పుష్ప" సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక పుష్ప సినిమాకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.ఇప్పటికే సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చినా ఫ్యాన్స్ ఊర్రూతలూగిపోతున్నారు.తెగ లైక్స్ చేసేస్తున్నారు. షేర్లు చేసేస్తున్నారు. రీసంట్ గా అందుతున్న మేటర్ ఏంటంటే, మన పుష్ప రాజ్ కి విలన్ ని సెట్ చేసేశారట. నిజానికి ఈ సినిమాలో విలన్ పై చాలా పేర్లు వినిపింంచాయి.

ఫస్ట్ లో విజయ్ సేతుపతిని తీస్కున్నారు. కానీ , కొన్ని కారణాల వల్ల సేతుపతి తప్పుకున్నాడు. తర్వాత బాబీ సింహా పేరు వినిపించింది.కానీ ఫైనల్ అవ్వలేదు. జగ్గుభాయ్ నే కన్ఫార్మ్ చేశారు అన్నారు. కానీ అది కూడా అఫీషియల్ గా వినిపించలేదు. ఆ తర్వాత తమిళ స్టార్ హీరో ఆర్య పేరు పుష్ప టీమ్ లో వినిపించింది. కానీ అఫీషియల్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే, ఇప్పుడు రీసెంట్  గా ఆర్యాని  కన్ఫార్మ్ చేశారు అంటూ ఒక న్యూస్ గట్టిగా వినిపిస్తోంది. నిజానికి ఆర్యని ఫైనల్ చేసినట్లుగా ఎప్పట్నుంచో టాక్ అనేది వచ్చింది. కానీ అఫీషియల్ గా మాత్రం పోస్టర్ రిలీజ్ చేయలేదు.

గతంలో ఆర్య అల్లు అర్జున్ తో కలిసి వరుడు సినిమాలో నటించాడు. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యింది. ఆ సినిమాలో కూడా బన్నీకి విలన్ గా నటించాడు ఆర్య. ఇప్పుడు కూడా పుష్పరాజ్ కి విలన్ గా నటించబోతున్నాడని అంటున్నారు. దీనికోసం ఆర్య బాడీ బిల్డింగ్ కూడా చేశాడట. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: