జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ టైం వచ్చినట్టు అంటున్నారు. కృష్ణవంశీ లాక్ డౌన్ టైం లో ఓ ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ కథ రాసుకున్నాడట. ఈ కథకు బాలీవుడ్ భామ జాన్వి కపూర్ హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. ఇప్పటికే జాన్వి కపూర్ టీం తో డిస్కషన్స్ నడిపినట్టు తెలుస్తుంది. కృష్ణవంశీ సినిమా ద్వారా పాపులర్ అయిన తెలుగు భామలు చాలామంది ఉన్నారు. అలానే జాన్వి కపూర్ కూడా సీనియర్ అండ్ టాలెంటెడ్ డైరక్టర్ కృష్ణవంశీ సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది.
కృష్ణవంశీ చెప్పిన కథ నచ్చితే మాత్రం జాన్వి కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ కన్ ఫాం అయినట్టే అని చెప్పొచ్చు. జాన్వి కపూర్ ని తెలుగు తెరకు పరిచయం కావాలని స్టార్ డైరక్టర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబో సినిమాలో జాన్వి కపూర్ చేస్తుందని అన్నారు. విజయ్ దేవరకొండ కూండా జాన్వి కపూర్ తో రొమాన్స్ కు రెడీ అవుతున్నాడు. మరి జాన్వి తొలి తెలుగు సినిమా ఏదవుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి