టాలీవుడ్ హీరో యూత్ స్టార్ నితిన్ హీరోగా గతేడాది వచ్చిన "భీష్మ "
సినిమా మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే.వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఆ
సినిమా ప్లాపుల్లో వున్న
నితిన్ కి ఆ
సినిమా మంచి హిట్ ఇచ్చి బ్రేక్ ని ఇచ్చింది.ఆ సినిమాతో
నితిన్ ప్లాపులకి బ్రేక్ పడింది. ఇక ఆ
సినిమా తరువాత సంవత్సరం గ్యాప్ తీసుకోని
నితిన్ ఎన్నో అంచనాలతో
చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో "చెక్ "
సినిమా చేశాడు.'భవ్య క్రియేషన్స్' బ్యానర్ పై వి. ఆనందప్రసాద్ ఈ సినిమాని నిర్మించాడు. ఈ సినిమాలో హాట్ బ్యూటీస్ రకుల్ ప్రీత్ సింగ్,
ప్రియా ప్రకాశ్ వారియర్ వంటి క్రేజీ భామలు హీరోయిన్లుగా నటించారు…ఇక ఈ
సినిమా ఫిబ్రవరి 26న విడుదలైంది. మొదటి షో నుండీ ఈ చిత్రానికి…పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ… దానిని క్యాష్ చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యింది 'చెక్'. మొదటి రోజు బాగానే కలెక్ట్ చేసినప్పటికీ ఆ తరువాత నుండీ డౌన్ అవుతూ వచ్చింది.
రెండో వీకెండ్ కూడా ఎక్కువ థియేటర్లలోనే ప్రదర్శింపబడినప్పటికీ..పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది.ఇక "చెక్"
సినిమా వసూళ్ల విషయానికి వస్తే...'చెక్' సినిమాకి రూ.16.10కోట్ల
బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు రూ.16.60 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ
సినిమా కేవలం 9.30 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 7.30 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో వీకెండ్ ను క్యాష్ చేసుకోవడంలో ఈ చిత్రం పూర్తిగా విఫలమయ్యింది.కాబట్టి ఇక కష్టమనే చెప్పాలి..ఇక దీంతో ఈ
సినిమా డిజాస్టర్ వైపు అడుగులు వేస్తుంది.భీష్మ సినిమాతో మంచి హిట్ కొట్టి ట్రాక్ లోకి వచ్చిన యూత్ స్టార్
నితిన్ కి
చెక్ రూపంలో మళ్ళీ ప్లాపు పడింది..