
ఇలా చేస్తే కరోనా వ్యాప్తి పెరుగుతుందనే ఉద్దేశంతో.. సాధారణ ప్రజలను తరిమి తరిమి కొడుతున్నారు ...ఒకవిధంగా సమంజసమే అనుకుందాం. మరి అదే న్యాయం అధికారులకు, ప్రజాప్రతినిధులకు కూడా వర్తించాలి కదా. వారు కూడా కరోనా నిబంధనలను ఉల్లంఘించినప్పుడు ప్రజలు కూడా వారిని అలాగే ట్రీట్ చేయాలి కదా అన్న ఉద్దేశంతో అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. కరోనా గురించి ఇంత శ్రద్ధ చూపిస్తున్న అధికారులు కుంభమేళా సమయంలో సామూహికంగా వందలమంది సాధువులను అనుమతించేటప్పుడు... వారి జాగ్రత్త ఎక్కడికి పోయింది..?? అప్పుడు కరోనా వ్యాప్తి చెందదా..?? ఇలా సమాజం పట్ల తమ బాధ్యత విస్మరించినందుకు పోలీసులను, ప్రభుత్వ అధికారులను ప్రజలు కొడితే ఫర్వాలేదా అని వర్మ ముక్కుసూటిగా ప్రశ్నించారు. దీనికి ఏమి సమాధానం చెప్తారు అంటూ విమర్శించారు. కరోనా వైరస్ ప్రభావం.. దేశంలో ఉన్నప్పటికీ... ఆ విషయాన్ని విస్మరించి ఓవైపు ఎన్నికలు మరోవైపు కుంభమేళాకు కేంద్రం అనుమతి ఇవ్వడం వలనే కరోనా సెకండ్ వేవ్ విలయం మొదలైంది అన్న విమర్శలు ఉన్నాయి.