సూపర్ స్టార్ మహేష్ వర్షం స్నిమా చేస్తే. ప్రభాస్ కెరియర్ లో మొదటి సూపర్ హిట్ సినిమా వర్షం ఆ సినిమా మహేష్ ఎలా చేస్తాడని అనుకోవచ్చు. మహేష్ తో బాబీ సినిమా చేసిన డైరక్టర్ శోభన్ ప్రభాస్ తో వర్షం సినిమా చేశాడు. 2002లో మహేష్ బాబీ సినిమా చేశాడు. ఆ సినిమా కథ చెప్పినప్పుడు బాగానే అనిపించినా సినిమా సరిగా తీయలేదు. మహేష్ కెరియర్ లో డిజాస్టర్స్ లో ఒకటిగా బాబీ నిలిచింది. మహేష్, ఆర్తీ అగర్వాల్ జోడీగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది.

ఇక ఈ సినిమా తీసిన శోభన్ మహేష్ కోసమే వర్షం కథ రాసుకున్నారు. అయితే బాబీ ఇచ్చిన షాక్ వల్ల వర్షం సినిమాను మహేష్ చేయనని చెప్పారట. దానితో ప్రభాస్ తో ఆ సినిమా చేశారు. అప్పటికి ఈశ్వర్ తో ఎంట్రీ ఇచ్చి రాఘవేంద్ర సినిమాతో ఫ్లాప్ అందుకున్న ప్రభాస్ వర్షం సినిమాకు సైన్ చేశాడు. వీరు పోట్ల కథ అందించిన ఈ సినిమాను ఎమ్మెస్ రాజు నిర్మించారు. వరంగల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లో మొదటి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సూపర్ హిట్ అయ్యింది.

ప్రభాస్, త్రిషల జోడీ వర్షం సినిమాకు ప్రధాన హైలెట్ గా చెప్పుకోవచ్చు. సినిమాలో ప్రకాశ్ రాజ్ నటన కూడా మెప్పిస్తుంది. వర్షాన్ని కూడా సినిమాలో ఒక పార్ట్ గా చేసి చూపిస్తాడు డైరక్టర్ శోభన్. మొత్తానికి మహేష్ నో చెప్పడంతో ప్రభాస్ ఆ ఛాన్స్ అందుకుని ఈ సినిమాతో తనకంటూ ఒక మార్క్ ఏర్పరచుకున్నాడు. ఇక ఆ తర్వాత మన బాహుబలి సినిమాల ప్రస్థానం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ నేషనల్ స్టార్ గా ఎదిగాడు. బాహుబలి మొదటి రెండు పార్టులు ప్రభాస్ ఇమేజ్ ను బీభత్సంగా పెంచాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: