ఇస్మార్ట్ శంకర్ సినిమా విజయం తరువాత హీరో రామ్ లో ఏదో తెలియని కొత్త హుషారు కనిపిస్తుంది. అంతకుముందు ఆయన కథల ఎంపికలో, సినిమా చేయడంలో పెద్దగా యక్టివ  గా ఉండేవారు కారు కానీ ఆ సినిమా విజయం తరువాత రామ్ లో తెలియనీ జోష్ కనిపిస్తోందని ఆయన అభిమానులు అంటున్నారు. ఆ జోష్ వల్లనే ఆయన తదుపరి సినిమా రెడ్ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయిన అది ఆయనపై పెద్దగా ప్రభావం చూపలేదు.

ప్రస్తుతం ఆయన లింగుస్వామి దర్శకత్వంలో మాస్ మసాలా చిత్రం చేయనున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో రామ్ గతంలో ఎప్పుడు కనిపించని విధంగా కనిపించబోతున్నాడట ఓ పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో కనిపిస్తున్నారని ఆయనను ఎంతో స్టైలిష్ గా చూపడానికి లింగుస్వామి కంకణం కట్టుకున్నారని ఆయన అభిమానులు తెలుపుతున్నారు. నిజానికి రామ్ లింగుస్వామి తో సినిమా విషయంలో ఒక పెద్ద సాహసం చేశాడని చెప్పవచ్చు.

అదేంటంటే ఇటీవలే రామ్ తన ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశాడు. ఫైనల్ నరేషన్ విన్నాను. చాలా బాగుంది. సెట్స్ మీదకు వెళ్ళటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అనే అర్థం వచ్చేటట్లు ఆయన లింగుస్వామి తో సినిమా గురించి పోస్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా అధికారిక ప్రకటన వెలువడినప్పుడు ఈ సినిమా కథని పూర్తిగా వినకుండానే ఓకే చేశాడా అనే ఆశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు. లింగస్వామి మీద నమ్మకంతోనా , లేదంటే చెప్పిన కథ పై నమ్మకంతోనా తెలీదు కానీ ఈ సినిమాను ఫైనల్ నరేషన్ వినకుండానే ఓకే చేశాడు రామ్.  ఆ విధంగా ఈ రోజుల్లోహీరో కూడా సాహసం చేయరు. పూర్తిగా పదవిని నచ్చాకే ఓకే చెప్తారు.  కానీ రామ్ మాత్రం గాలిలో దీపం పెట్టి లక్ కోసం ఎదురు చూడగా అది లక్కీగా వర్కౌట్ అయిందని చెప్పవచ్చు. గతంలో చాలా సినిమాలు ఇలాగే ముందుగానే అనౌన్స్ చేసిన తర్వాత ఫైనల్ నరేషన్ నచ్చక క్యాన్సిల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: