టాలీవుడ్ లో
హీరోయిన్ జయప్రద గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. తన నటన ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్న అందం ఆమె సొంతం.
జయప్రద సినిమాలలో సాగరసంగమం
సినిమా ను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఆ సినిమానే కాకుండా ఇంకా ఎన్నో సినిమాలలో నటించి స్టార్
హీరోయిన్ గా ఎదిగారు. ఆమె
హీరోయిన్ గా నటించే టైం లో స్టార్ హీరోలు ఆమెతో మళ్లీ మళ్లీ నటించాలనుకునేవారు. అంతులేని కథ, అడవి రాముడు, వేట, యమగోల, స్వయంవరం, దేవత, సిరిసిరిమువ్వ, యుద్ధం వంటి చిత్రాలతో
జయప్రద టాలీవుడ్ లో స్టార్
హీరోయిన్ గా ఎదిగింది.
అయితే ఆమె వయసు పెరుగుతున్న కొద్దీ సినిమాలను తగ్గిస్తూ వచ్చింది.
పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయిపోయింది.
ఇండస్ట్రీ లో పెద్ద
ప్రొడ్యూసర్ గా ఉన్న
శ్రీకాంత్ నహత ను ప్రేమించి పెళ్లాడిన
జయప్రద అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్న
శ్రీకాంత్ ను
పెళ్లి చేసుకోవడం ఒక సెన్సేషనల్ అయింది. పెళ్లికి ముందు నాలుగేళ్లు సన్నిహితంగా మెలిగిన వీరు ఆ తర్వాత
జయప్రద ఒత్తిడి మేరకు ఆమెను
పెళ్లి చేసుకున్నాడు శ్రీకాంత్. ఎప్పటికప్పుడు ఆయన పెళ్లిని వాయిదా వేస్తూ రాగా
భార్య చంద్ర కు తెలియకుండా 1986లో ఓ ఫైవ్ స్టార్ హోటల్లో రహస్యంగా
పెళ్లి చేసుకున్నారు.
ఆ తర్వాత ఈ విషయం తెలిసిన ఆయన మొదటి
భార్య పెద్ద గొడవ చేయగా
శ్రీకాంత్ ను ఎంతో వేధించడమే కాకుండా
జయప్రద ను కూడా బాధించేదట. ఆమె వేధింపులు తట్టుకోలేక
జయప్రద ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతుంటారు. ఇటీవల
శ్రీకాంత్ కన్నుమూసారు. ఒకనాటి టాప్
నిర్మాత సుందర్ లాల్ నహత కుమారుడే ఈ
శ్రీకాంత్ నహత. సూపర్ స్టార్
కృష్ణ తో ఏజెంట్ గోపి తో సహా మూడు సినిమాలు చేయగా ఏజెంట్ గోపి లో
జయప్రద హీరోయిన్. ఆమె అందం, అభినయం
శ్రీకాంత్ ను ఆకట్టుకోగా అక్కడే ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆ
మూవీ క్లైమాక్స్ లో జయప్రదకు ప్రమాదం జరిగితే
శ్రీకాంత్ స్పెషల్ కేర్ తీసుకోవడం తో
జయప్రద కూడా ఆయనను ప్రేమించడానికి కారణం అయ్యింది.