
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ నటుడు ఫాహాద్ ఫాజిల్ విలన్ గా చేస్తున్నాడు. సుకుమార్ అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో గతంలో ఆర్య, ఆర్య 2 వంటి సూపర్ హిట్ సినిమాలు రా ఈ సినిమా తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని భావిస్తున్నారు వీరిద్దరు. ఈ సూపర్ హిట్ కాంబో నుంచి విడుదలైన టీజర్ కు దేశవ్యాప్తంగా మంచి పేరు రాగా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాపై దేశం మొత్తం భారీ అంచనాలు నెలకొన్నాయి.
షూటింగ్ పూర్తి చేసుకుంటున్న పుష్ప సినిమా విడుదల తేదిని త్వరలోనే ప్రకటించనున్నారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేయబోయే దర్శకుల లిస్టు చూస్తే చాలా పెద్దదిగా అనిపిస్తుంది. వాస్తవానికి ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలి కానీ చివరి నిమిషంలో కొరటాల శివ తన మనసు మార్చుకుని ఎన్టీఆర్ తో సినిమా చేస్తుండడంతో బన్నీ నెక్స్ట్ ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన నెక్స్ట్ సినిమా కి ప్రశాంత్ నీల్, బోయపాటి శ్రీను, మురుగదాస్ వంటి దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి.
అయితే వీరి ముగ్గురిలో ఎవరితోనో ఒకరితో సినిమా ఉంటుందని తెలుస్తున్నా ఆ దర్శకుడు ఎవరు అన్నది ఇంతవరకు తెలియకపోవడంతో అభిమానులు అల్లు అర్జున్ నెక్స్ట్ చేయబోయే సినిమా ఏ దర్శకుడితో ఉంటుందో అని అయోమయంలో ఉన్నారు. ఇతర టాలీవుడ్ హీరోలు అందరూ తమ తదుపరి నాలుగు సినిమాల వరకు ప్రాజెక్టులను అనౌన్స్ చేసుకోగా అల్లు అర్జున్ మాత్రం పుష్ప సినిమా పూర్తి అవుతున్నా కూడా తన తదుపరి సినిమాను ప్రకటించలేదు అన్నది అభిమానుల ఆందోళన. ఇక పుష్ప 1 సినిమా టాక్ ను బట్టి రెండో పార్ట్ విషయంలో బన్నీ ముందుకెళ్లనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.