ఒక చిన్న
తమిళ చిత్రం తెలుగులో విడుదలయ్యి ఘనవిజయాన్ని సాధించడమంటే సాధారణ విషయం కాదు. ఇప్పుడున్న ప్రజల అభిరుచికి తగ్గట్లు
సినిమా తీసి వారిని మెప్పించడమంటే చాలా గొప్ప విషయమనే చెప్పాలి. మరి ఆ
సినిమా ఏమిటో తెలుసా 'బిచ్చగాడు'. వస్తావా సంఘటనల ఆధారంగా అమ్మ సెంటిమెంట్ ను ప్రధాన ఇతి వృత్తంగా తీసుకుని దర్శకుడు చేసిన సృష్టి అద్భుతమని చెప్పాలి. ఈ సినిమాను చూసిన ఏ ఒక్కరూ కంట నీరు పెట్టకుండా లేరనే చెప్పాలి. అంతలా ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకు పోయింది. ఈ
సినిమా 2016 లో విడుదలయి మంచి కలెక్షన్ లతో అంతకు మించి మంచి పేరును సంపాదించుకుంది. ఈ సినిమాకు శశి దర్శకత్వం వహించారు.

కథనంలో ఎక్కడా బోర్ ఫీల్ లేకుండా ప్రేక్షకుడిని సినిమాలో లీనమయ్యేలా చేయడంలో దర్శకుడు సక్సె అయ్యాడని చెప్పాలి. ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన
విజయ్ ఆంథోనీ మరియు సట్నా టైటస్ నైటీలు అనడం కన్నా, జీవించారు అని అనడం సబబుగా ఉంటుంది. ఈ
సినిమా విజయానికి మ్యూజిక్ కూడా ఒక ఎస్సెట్ అయింది. ఈ
సినిమా తరువాత
విజయ్ ఆంటోనీకి తెలుగులోనూ మంచి
మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు ఈ సినిమానే సీక్వెల్ గా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు
డైరెక్టర్ గా కొత్త వారిని తీసుకోబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమాకు నిర్మాతగా
విజయ్ ఆంథోనీ వ్యవహరిస్తుండగా, ప్రస్తుతానికి ఈ
సినిమా దర్శకుడి విషయం సస్పెన్స్ గా ఉంది..

అయితే రేపు ఉదయం 11 గంటలకు ఈ సినిమాకు
డైరెక్టర్ ఎవరనే విషయాన్నీ ప్రముఖ
డైరెక్టర్ ఏ ఆర్
మురుగదాస్ అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఈ
సినిమా మొదటి పార్ట్ లాగానే హిట్ ను సొంతం చేసుకుంటుందా అని తెలుసుకోవాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయక తప్పేలా లేదు.