టాలీవుడ్ సినీ పరిశ్రమలో
హీరోయిన్ లు ఛాన్సుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫేడ్ అవుట్ అయిపోయిన
హీరోయిన్ లు మళ్లీ ఒక పెద్ద ఛాన్స్ కోసం చూస్తూ ఉంటారు. ఆ విధంగా వారు మళ్లీ ఫామ్ లోకి వచ్చి బిజీ అయిపోవాలని చూస్తూ ఉంటారు. అలా
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్
హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన
హీరోయిన్ త్రిష ఇప్పుడు ఒక మంచి
సినిమా టాలీవుడ్ లో చేసేందుకు ఎదురుచూస్తుంది. లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ప్రస్తుతం బిజీ గానే ఉన్నా పెద్ద హీరోతో
సినిమా చేసి మళ్లీ మునుపటి క్రేజ్ ను దక్కించుకోవాలని ఆమె చూస్తుంది.
ఆ విధంగా
టాలీవుడ్ లో తనకు తెలిసిన దర్శకులకు హీరోలకు తాను
హీరోయిన్ గా చేసేదుకు రెడీ అని, అవసరమైతే క్యారెక్టర్లు చేయడానికి కూడా రెడీ అని చెబుతుందట. అయితే అందరికీ ఈ విషయం చెప్పింది కానీ తనకు వచ్చిన అన్ని రకాల పాత్రలు చేయట్లేదట. ఇటీవలే
చిరంజీవి హీరోగా నటిస్తున్న లూసిఫర్
రీమేక్ సినిమాలో
హీరోయిన్ పాత్ర రాగా
త్రిష రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది. అంతే కాకుండా
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తదుపరి చిత్రం లో కూడా
త్రిష కు ఛాన్స్ గా అది కూడా ఆమె రిజెక్ట్ చేసిందట.
కారణం ఏమైనా కూడా
చిరంజీవి బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాలను రిజెక్ట్ చేసి
త్రిష తప్పు చేసిందని ఆమె అభిమానులు చెబుతున్నారు. ఇద్దరు స్టార్ హీరోలతో
సినిమా చేసి ఉంటే మంచి కం బ్యాక్ దక్కి ఉండేది అని మునుపటిలా మళ్లీ బిజీ అయి ఉండేదని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వెలువడుతున్నాయి. సర్కారు వారి పాట
సినిమా తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ
సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రెండో
హీరోయిన్ గా
త్రిష ను ఎంచుకున్నాడు త్రివిక్రమ్. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ
బాలకృష్ణ చిరంజీవి లాంటి హీరోలకు నో చెప్పి మహేష్ తో
సినిమా చేయడం ఇప్పుడు
టాలీవుడ్ అంతటా చర్చనీయాంశంగా మారింది.