తెలుగు వారికి సుపరిచితమైన యాంకర్ సుమ కనకాల. మలయాళీ అయినప్పటికీ తెలుగు భాష పట్ల పట్టు సాధించి మొదటి నుంచి యాంకర్‌గానే కొనసాగుతోంది. ఈటీవీ చానల్‌లో ప్రసారమయ్యే ప్రోగ్రామ్స్ అన్నిటిలో ఆమె యాంకర్ అనిపిస్తుంటుంది. ఓ వైపు చానల్స్‌లో కొనసాగుతూనే సినిమా ఫంక్షన్లలోనూ వ్యాఖ్యాతగాను ఉంటుంది సుమ. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సినీ ఈవెంట్స్, మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఇలా సినిమా కార్యక్రమం ఏదైనా అక్కడ సుమ వాలిపోయి ఈజీగా హుషారుగా యాంకరింగ్ చేయడంలో సుమ దిట్ట అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాజాగా ఈటీవీ చానల్‌లో ప్రసారమయ్యే ఓ ప్రోగ్రాంలో సుమను సీనియర్ నటి ఓ కామెంట్ చేయగా, అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ సుమను ఎవరు ఏమన్నారంటే..

ఈటీవీలో కొన్నేళ్లుగా ప్రసారమవుతున్న ‘క్యాష్’ షో సక్సెస్ వెనకాల యాంకర్ సుమ ఉందని చెప్పొచ్చు. తనదైన మాటలతో ప్రోగ్రాం పార్టిసిపెంట్స్‌లో ఫుల్ జోష్ నింపుతుంది సుమ. షో టైం మొత్తం మాటల తూటాలు పేలుస్తూనే ఉంటుంది. పంచ్ టైమింగ్స్ కూడా అదిరిపోతుంటాయి. అయితే తాజాగా ఈ షోలో సీనియర్ నటి సుమపై పంచ్ విసరడం హైలైట్ అయింది. అసలు విషయానికొస్తే...ఈ నెల 31న ప్రసారం కానున్న ‘క్యాష్’ ప్రోగ్రాం ప్రోమో విడుదలైంది. ఇందులో సీనియర్ యాక్టర్స్ రాజ్యలక్ష్మి, గౌతం రాజు, శివ పార్వతి, బాబు మోహన్ పాల్గొన్నారు. ఇక వీరి సరదా సంభాషణ అద్భుతంగా కొనసాగింది.


ఈ క్రమంలోనే నటి రాజ్యలక్ష్మి ఎంటర్ అవుతూనే సుమపై పంచ్ వేసింది. సుమను చూస్తుంటే అసూయగా ఉందని, తామెప్పుడో చిన్నప్పుడు లంగావోణీలు వేశామని, కానీ, సుమ మాత్రం ఇప్పటికీ వేస్తోందని కామెంట్ చేసింది. తద్వారా సుమ చాలా పెద్దవయసు ఉన్న ఆవిడని చెప్పకనే చెప్తూ పంచ్ వేయగా, సుమ కూడా వెంటనే రియాక్ట్ అయింది.  తను పెద్ద వయసుదానినా? అని అంటూ సరదాగా పంచ్ స్వీకరించింది సుమ. అది చూసి అక్కడి వారు నవ్వగా, ప్రేక్షకులూ నవ్వుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తన గ్లామర్ రహస్యం వాగుడు అని సుమ చెప్తుంది. ఈ షోలో బాబు మోహన్ నాటి కాలంలో చేసిన పాత కామెడీ సీన్లు ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా ఈ ప్రోమో వీడియో నెట్టింట సందడి చేస్తోంది. ఈ నెల 31న ఫుల్ ఎపిసోడ్ ఈటీవీలో ప్రసారం కానుంది. ఇక అప్పుడు షో చూసి పూర్తిగా నవ్వుకోవచ్చు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: