మెరిసిపోయే అందం ఉంటే సినిమాల్లోనూ, మోడల్ గానే, మొత్తంగా గ్లామర్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వచ్చు కదా అని సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ లక్షణాలతో పాటు సినిమా రంగానికి సంబంధించిన కుటుంబం వారు అయితే పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో మన చెప్పనక్కరలేదు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిని బాలీవుడ్ స్టార్ హీరో అయినా బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవరాలు ఎదుర్కొంటోంది. అమితాబచ్చన్ మనవరాలు నవ్య నవేలిని ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. బాలీవుడ్ హీరోయిన్ కు ఏ మాత్రం తగ్గని అందచందాలు ఆమె సొంతం. బిగ్ బీ మనవరాలు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. ఆమె చేసే పోస్టులు ఆసక్తికరంగానే కాకుండా అందరిని ఆకట్టుకునే విధంగా కూడా ఉంటాయి. నవ్య కు సోషల్ మీడియాలో భారీగానే ఫాలోయింగ్ ఉంటుంది. ఆమె పోస్ట్ చేసే పోస్టులను చూసినవారంతా బచ్చన్ ఫ్యామిలీ నుండి మరొక హీరోయిన్ రావడం ఖాయం అన్నట్టుగా కామెంట్లు పెడుతుంటారు.


తాజాగా నవ్య పింక్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చూసిన వాళ్ళంతా వావ్ అనేలాఈ ఫోటో ఉంది. ఫోటోకు మంచి సానుకూల స్పందన వచ్చింది. బ్యూటిఫుల్ అంటూ బోలెడన్ని కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. ఒక నెటిజన్ అయితే కాస్త చొరవ తీసుకుని చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. బాలీవుడ్ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వచ్చు కదా అని వ్యాఖ్య చేశారు. దానికి నవ్య కూడా రియాక్ట్ అయ్యింది. చాలా పొందికగా, హుందాగా తన జవాబు తెలియజేసింది. మీ అభిమానానికి థాంక్స్. అందమైన మహిళలు వ్యాపారాల్లో ను రాణించగలరు అంటూ జవాబిచ్చింది. తాజా పోస్ట్ తో బిగ్ బి మనవరాలికి సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదు అని నేరుగా చెప్పకుండా అందమైన మహిళలకు కేవలం గుర్తింపు సినిమాలే కాదు అని మరికొన్ని వేదికలు ఉన్నాయి అన్న విషయాన్ని ప్రస్తావించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: