దక్షిణాదిన అగ్ర దర్శకుడు గా
శంకర్ కు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. భారీ భారీ చిత్రాలను భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో అన్ని భారీగా ఉండేలా చూసుకుంటాడు
శంకర్ తన సినిమాలలో. అయితే
శంకర్ సినిమా లో ఎంత ప్రాఫిట్ ఉంటుందో అంతే రిస్కు కూడా ఉంటుంది. కొంచెం అటూ ఇటూ అయినా భారీ నష్టాలను చవి చూస్తారు సదరు నిర్మాత. ఆ విధంగా గతంలో చాలాసార్లు
శంకర్ సినిమాల విషయంలో రుజువు అయ్యాయి. నిర్మాతలు అందుకే ఆయనతో జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ వస్తారు.
సినిమా సూపర్ హిట్ అయినా కూడా కొన్ని సందర్భాల్లో ఆయన
సినిమా లకు లాభాలు ఓపట్టాన రావు.
దానికి కారణం లేకపోలేదు కేవలం భారీ చిత్రాలను మాత్రమే తెరకెక్కించే
శంకర్ అన్ని భారీగా ప్లాన్ చేయడం తో ఎక్కువ రోజులు షూటింగ్ చేసుకోవడం వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా ఎక్కువగా అవుతుంది. అందువల్ల చెప్పిన బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ కావడంతో సినిమాకు తక్కువ లాభాలు లేదా నష్టాలు చేకూరుతాయి. కొన్ని సార్లు హిట్
సినిమా లకు నష్టాలు మిగిలుస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే సంవత్సరాలకు సంవత్సరాలు ఆయన సినిమాల షూటింగులు జరుపుకుంటూ వస్తాయి. ఓ
రీమేక్ సినిమా షూటింగ్ తప్ప మిగతావన్నీ రెండేళ్లకు పైగా షూటింగ్ లు చేశాడు శంకర్.
ఇక గత కొన్ని రోజులుగా
శంకర్ పరిస్థితి ఏ మాత్రం బాగా లేదనే చెప్పాలి. ఓవైపు ఐ
సినిమా ఫ్లాప్ కావడంతో ఒక్కసారిగా కృంగిపోయిన
శంకర్ కు రోబో 2.0
సినిమా దారుణమైన ఫలితాన్నే కాకుండా భారీ నష్టాలను కూడా మిగిలించింది. ఆ తర్వాత ఎన్నో అంచనాలతో మొదలుపెట్టిన
ఇండియన్ 2
సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా పక్కన పెట్టి
రామ్ చరణ్ తో
సినిమా చేస్తున్నాడు. అయితే గతంలోలా కాకుండా ఈ సినిమాకు చకచకా పనులు పూర్తి చేస్తున్నాడు. కథానాయికగా కీయరా అద్వానీ నీ ఎంపిక చేసాడు. ఆరు నెలల వ్యవధిలోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి ప్రణాళికలు రచించారు.
టాలీవుడ్ కి వచ్చాక
శంకర్ తీరులో మార్పు ను
కోలీవుడ్ ప్రేక్షకులు చూసి ఆశ్చర్యపోతున్నారట.