
టాలీవుడ్ సినిమా పరిశ్రమ సంక్రాంతికి భారీ సినిమాలతో ప్రేక్షకులను కనువిందు చేయడానికి రాబోతుంది. ఐదు భారీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు నిర్మాతలు. ఎన్నడూ లేని విధంగా ముగ్గురు స్టార్ హీరోలు ఐదు నెలల ముందుగానే రిలీజ్ డేట్స్ ప్రకటించగా ఓ సీనియర్ హీరో కూడా బరిలోకి దిగనున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ ఎకే రీమేక్, ప్రభాస్ రాధే శ్యామ్, వెంకటేష్ f3 సినిమాలు కేవలం నాలుగైదు రోజుల గ్యాప్ లోనే ఈ నాలుగు సినిమాలు రానున్నాయి.
దీంతో సంక్రాంతి ఎంతో రసవత్తరంగా మారిపోయింది. వీటిలో సంక్రాంతి విన్నర్ గా నిలిచేది ఎవరా అని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలయ్యే సినిమాలలో దేని ప్రత్యేకత దానికి ఉంది. సరిలేరు నీకెవరు వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న సినిమా సర్కారు వారి పాట పై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ మొదటిసారిగా మరొక స్టార్ హీరోతో కలిసి చేస్తున్న ఏకే రీమేక్ పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. రానా మరో హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమాలో.
ఇక పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. సాహో సినిమా తర్వాత ప్రభాస్ సినిమా వచ్చి రెండు సంవత్సరాలు అయిన నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ఫ్యామిలీ కథ చిత్రం ఎఫ్3 కూడా ఈ సంక్రాంతి కి రావాలని చూస్తుంది. వెంకటేష్ వరుణ్ తేజ్ లు హీరోలుగా నటిస్తుండగా ఈ సినిమా ఎఫ్2 సినిమాకి సీక్వెల్ కాగా సంక్రాంతికే విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఇలా అన్ని ప్రత్యేకతలు ఉన్న సినిమాలకు ఆయన అభిమానులు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలు విడుదలయ్యేత వరకు ఏ సినిమా టాప్ పోజిషన్ లో నిలబడుతుందో చెప్పడం కష్టం.