టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. వాటిలో ఒకటి క్రిష్ జాగర్లమూడి తీస్తున్న హరిహర వీరమల్లు కాగా మరొకటి యువ దర్శకుడు సాగర్ కె చంద్ర తీస్తున్న చిత్రం. అయితే వీటిలో హరిహర వీరమల్లు సినిమా పీరియాడికల్ మూవీ గా తెరకెక్కుతుండగా మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై దీనిని ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు.

త్వరలో తదుపరి షెడ్యూల్ జరుపుకోనున్న ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన టీజర్ అందరిలో సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచింది. ఇక దీని తో పాటు సాగర్ తీస్తున్న మలయాళ మూవీ అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్, భీమ్లా నాయక్ అనే పోలీస్ అధికారిగా యాక్ట్ చేస్తుండగా దగ్గుబాటి రానా మరొక కీలక పాత్ర చేస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తుండగా సూర్యదేవర నాగ వంశీ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా యొక్క టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న ఉదయం 9 గంటల 45 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అధికారికంగా ప్రకటన చేసింది. కాగా ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ ప్రతిష్టాత్మక సినిమాని అన్ని కార్యక్రమాలు ముగించి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. మరి చాలా గ్యాప్ తరువాత పవర్ స్టార్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి .... !!


మరింత సమాచారం తెలుసుకోండి: