టాలెంట్ ను నమ్ముకొని ప్రేక్షకుల ముందుకు మంచి మంచి పాత్రలతో వచ్చి వారి అభిమానాన్ని సంపాదించుకుని హీరోగా గా నటుడిగా ఎదిగాడు సత్యదేవ్. తొలుత కొన్ని సినిమాలలో సహాయక పాత్రలు నటించి ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నాడు. ఆ విధంగా ఆయన కెరీర్లో హీరో గా బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య వంటి చిత్రాలు హిట్ కావడంతో ఆయనకు ఒక్కసారిగా క్రేజ్ వచ్చింది. అంతే కాకుండా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాలో కీలక పాత్ర పోషించిన సత్య దేవ్ ఆ సినిమాతో మరింత క్రేజ్ రావడంతో పెద్ద సినిమాల అవకాశాలు రావడం మొదలు పెట్టాయి.

ఇటీవలే కరోనా నేపథ్యంలో తమ సినిమాలను విడుదల చేయడానికి పెద్ద హీరోలు సైతం భయపడుతున్న తరుణంలో సత్యదేవ్ తన చిత్రాన్ని విడుదల చేసి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. ఆయన హీరోగా నటించిన తిమ్మరుసు చిత్రం సెకండ్ వేవ్ తర్వాత మొట్ట మొదటగా విడుదలైన సినిమా. ఈ సినిమా కు థియేటర్ లో పాజిటివ్ టాక్ రావడం తో ఆయన స్టార్ డం మరో లెవల్ కి వెళ్ళిపోయింది. ప్రస్తుతం తమన్నా హీరోయిన్ గా శీతాకాలం గుర్తుందా అనే సినిమాలో చేస్తున్నాడు సత్య దేవ్.

అలాగే బాలీవుడ్ సినిమాల్లో సైతం కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తన రెమ్యూనరేషన్  గతంలో కంటే ఎక్కువగా పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన కోట్లల్లో తీసుకోవడం విశేషం. టాలీవుడ్ హీరోల స్థాయిలో సత్యదేవ్ మంచి మార్కెట్ కూడా ఏర్పడిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. చూడబోతే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరో అయినా వారి జాబితాలో సత్యదేవ్ కూడా నిలవబోతున్నాడు అని తెలుస్తుంది. ప్రస్తుతం మరిన్ని వినూత్నమైన సినిమాల నువ్వు చేసే పనిలో ఉన్నాడు సత్యదేవ్. మరి భవిష్యత్తులో టాలీవుడ్ లో ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో ఈ యంగ్ హీరో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: