గత కొద్ది రోజులుగా టాలీవుడ్ హోం టౌన్ లో ఎటు చూసినా అక్కినేని నాగ చైతన్య, సమంత ల విడాకుల విషయమే హాట్ టాపిక్ గా వినిపిస్తోంది. వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని, విషయం విడాకుల వరకు చేరుకుందని, సమంతకు భరణం ఇచ్చేందుకు చైతు సిద్ధమయ్యాడని ఈ కారణాల వల్లనే సమంత అక్కినేని కుటుంబానికి దూరమై చెన్నైలో ఉంటుందని, అంతేకాదు త్వరలో ముంబై కి పర్మినెంట్ గా షిఫ్ట్ అయ్యేందుకు సామ్ ప్లాన్ చేస్తున్నట్లు ఒకటి కాదు రెండు కాదు ఏ మీడియా లో చూసినా వీరి గురించే కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశంపై అటు అక్కినేని ఫ్యామిలీ కానీ ఇటు సమంత కానీ ఓ క్లారిటీ ఇవ్వకపోవడంతో.. ఈ ఊహాగానాలకు హద్దు అదుపు లేకుండా పోయింది.

అయితే ఇటీవలే ఫ్యాన్స్ తో ముచ్చటించిన సమంత తను హైదరాబాద్ వీడి ఎక్కడికి వెళ్లడం లేదని తన ఇల్లు హైదరాబాద్ నేనని ఇక ఈ రూమర్స్ ఎలా? ఎందుకు? ఎప్పుడు? మొదలయ్యాయో తనకు తెలియడం లేదని.. ఇవన్నీ ఒట్టి రూమర్స్ అని తేల్చి చెప్పేసింది.  దాంతో అక్కినేని ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. కానీ ఇప్పటికీ కొన్ని గుసగుసలు వినిపిస్తూనే వున్నాయి. ఇదిలా ఉండగా అక్కినేని అభిమానులు సెలబ్రేట్ చేసుకునే లడ్డు లాంటి వార్త ఒకటి ఇండస్ట్రీ నుండి వినిపిస్తోంది. ప్రముఖ దర్శకుడు తేజ చైతు మరియు సామ్ ల కాంబినేషన్ లో ఓ  సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నాగచైతన్య సమంతల కాంబోలో సినిమా అంటే...మామూలు విషయం కాదు. ఈ సెలబ్రిటీ జంట వెండితెరపై కనిపిస్తే జరిగే మ్యాజిక్కే వేరు. అందులోను ఈ గాసిప్స్ నడుమ ఇది నిజమైతే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని దాటుతాయి.

ఇక అభిమానుల గురించైతే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ వార్త వాస్తవం అని తెలియడం లేదు. ఏ గుళ్ళో చూసినా అక్కినేని అభిమానులు చైతు, సామ్ ల పేర్లపై ప్రత్యేక పూజలతో దర్శనమిచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఈ రూమర్స్ అన్ని రూమర్లగానే మిగిలిపోవాలని సామ్, చైతులు ఎప్పటిలాగే సంతోషంగా జీవించాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మరి ఇలాంటి తరుణంలో ఈ బిగ్ సెలబ్రిటీ జంటతో దర్శకుడు  తేజ సినిమా నిజమని తెలిస్తే ఇక టాలీవుడ్ ఆడియన్స్ ఆనందానికి అవధులు ఉండవు. మరి ఏమౌతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: