ఓం రౌత్‌ దర్శకత్వంలో వాల్మీకి రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్' అనే సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. ఆ ప్రకటనతోనే ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ మధ్యన అంచనాల స్థానంలో విమర్శలు మొదలయ్యాయి. ప్రభాస్‌ రాముడి పాత్రకి సరిపోడని, రాంగ్ ఛాయిస్‌ అని ట్రోలింగ్ జరిగింది. ప్రభాస్‌ 'ఆదిపురుష్' షూటింగ్‌కి వెళ్తున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అయితే ఈ ఫోటోస్‌లో ప్రభాస్‌ కొంచెం ఆడ్‌గా కనిపించాడనే కామెంట్స్‌ వచ్చాయి. ఇక ఉత్తరాది జనాలు అయితే ప్రభాస్‌ని విపరీతంగా ట్రోలింగ్‌ చేశారు. అంకుల్ వస్తున్నాడు తప్పుకోండని కొంతమంది, ఈ హీరో ఏజ్‌కి తగ్గ క్యారెక్టర్స్‌ చేసుకుంటే బెటర్ అని మరికొంతమంది ట్రోల్ చేశారు.

ఓం రౌత్‌తో పాటు నితీష్ తివారి కూడా రామాయణ గాధని తెరకెక్కిస్తున్నాడు. అల్లు అరవింద్, మధు మంతెన సంయుక్త నిర్మాణంలో త్రీడీలో రామాయణం తీస్తున్నాడు నితీష్ తివారి. ఇక ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, హృతిక్ రోషన్‌ రావణాసురుడిగా నటిస్తున్నారనే టాక్ వస్తోంది. రణ్‌బీర్ కపూర్, హృతిక్‌ రోషన్‌ కలిసి సినిమా చేస్తున్నారనే మాట వినిపించడం ఆలస్యం సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగులు ట్రెండ్‌ అయ్యాయి. ఈ స్టార్ వార్‌తో సిల్వర్‌ స్క్రీన్‌పై మేజిక్కులు జరుగుతాయనే అంచనాల్లోకి వెళ్లింది ట్రేడ్ ఇండస్ట్రీ. ఈ అంచనాలే 'ఆదిపురుష్'  బిజినెస్‌ని దెబ్బకొడతాయనే టాక్ వస్తోంది.

రణ్‌బీర్ కపూర్ ఎలాంటి క్యారెక్టర్ అయినా అద్బుతంగా చేస్తాడనే పేరుంది. సంజయ్‌ దత్ బయోపిక్ 'సంజు'తో బోల్డన్ని ప్రశంసలు అందుకున్నాడు. ఇక హృతిక్‌ రోషన్‌ స్క్రీన్‌పై ఉంటే విజిల్స్‌ పడతాయని మేకర్స్‌ కూడా నమ్ముతుంటారు. ఇలాంటి ఇద్దరు స్టార్లు కలిసి సినిమా చేస్తున్నారనగానే ఆటోమెటిక్‌గా అంచనాలు పెరిగిపోయాయి. రణ్‌బీర్ కపూర్, హృతిక్ రోషన్‌ ఇద్దరూ కటౌట్‌ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. సినిమాలకి తగ్గట్టుగా వాళ్లని వాళ్లు మార్చుకుంటున్నారు. అయితే ప్రభాస్‌ మాత్రం కొంచెం వెయిట్‌ పెరిగాడని, ఫేస్‌లో మునుపటి చార్మింగ్‌ లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి టైమ్‌లో వెండితెర రాముడిగా ప్రభాస్‌ కంటే రణ్‌బీర్‌కే ఎక్కువ మార్కులు వచ్చేలా ఉన్నాయి అంటున్నారు సినీజనాలు. ప్రభాస్ 'ఆదిపురుష్' ఆల్రెడీ షూటింగ్‌లో ఉంది. వచ్చే ఏడాది ఆగస్ట్‌ 11న సినిమా రిలీజ్‌ కాబోతోంది. అయితే రణ్‌బీర్, హృతిక్ రామాయణం ఇంకా చర్చల దశలోనే ఉంది. సీత పాత్ర ఎవరు చేస్తారనే విషయంలోనూ క్లారిటీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: