కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఎంత పెద్ద స్థాయి నటుడు అందరికీ తెలిసిందే. ఆయన నటించిన ప్రతి సినిమా కూడా తెలుగులో విడుదలై అక్కడి ప్రేక్షకులను కూడా అలరిస్తుంది. అలా గజినీ సినిమా నుంచి ఇప్పటి వరకు ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదల అయ్యింది. త్వరలోనే డైరెక్ట్ గా ఓ తెలుగు సినిమాలో కూడా ఆయన నటించే విధంగా ప్రణాళికలు వేసుకున్నారు. ఇక ఆయన సరసన నటించే హీరోయిన్ లు కూడా ఆయనతో పాటు సరిసమానంగా నటించగలమా అన్న భయం వారిలో ఎంతైనా నెలకొంటుంది. అంత పెద్ద నటుడి సరసన నటించడం అంటే మామూలు విషయం కాదు కదా.

ఆ విధంగా నంద గోపాల కృష్ణ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది సాయి పల్లవి. నటన విషయంలో సూర్య కి ఏమాత్రం తగ్గదు సాయిపల్లవి. తెలుగు మలయాళ తమిళ పరిశ్రమలో ఇప్పటికే ఆమెకు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో ఆమెకు ఓ స్టార్ హీరో స్థాయి లో మార్కెట్ వుంది. దీన్ని బట్టి సాయి పల్లవి తన నటనతో ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చెప్పుకోవచ్చు. అలా సూర్య సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది ఈ కుర్ర హీరోయిన్.

ఈ సినిమాలో సూర్య భార్య గా నటించి తనలోని సరికొత్త నటనకు శ్రీకారం చుట్టింది సాయి పల్లవి. అప్పటి వరకు లవర్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో నటించిన ఈమె తొలిసారిగా భార్య పాత్రలో నటించి ప్రేక్షకుల లో ఇలాంటి భార్య కావాలనే ఆసక్తి ని నెలకొల్పింది. 
 ఇక భర్తను అనుమానిస్తూన్న భార్య పాత్ర లో  అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో ఆయనను అనుమానిస్తూ ఉంటుంది.  హీరో ఆ విధంగా చేయకపోయినా అనుమానించే భార్యలు సమాజంలో ఉంటుంది ముఖ్యంగా రాజకీయ నాయకుల జీవితాలలో జీవిత భాగస్వామిలు ఈ విధంగానే ఉంటారని దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. ఏదేమైనా సాయిపల్లవి ఈ క్యారెక్టర్ ను చేయడం విశేషం అనే చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: