ఇటీవలే లవ్ స్టోరీ చిత్రం తో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకొని మంచి జోష్ లో ఉన్నాడు అక్కినేని నాగ చైతన్య. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి జంటగా అక్కినేని నాగచైతన్య అద్భుతం గా నటించిన ఈ సినిమా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కావడంతో పాటు భారీ వసూళ్లను సాధించిన సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమా తో అక్కినేని నాగచైతన్య రేంజ్ క్రేజ్ బాగా పెరిగిపోయిందని చెప్పాలి. ఒక్కసారిగా ఆయనకు లవర్ బాయ్ ఇమేజ్ క్రేజ్ బాగా పెరిగిపోయింది.

యూత్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఆయనకు విశేషమైన ప్రేక్షకులు ఏర్పడ్డారు. ఆ విధంగా అక్కినేని నాగచైతన్య లవ్ స్టోరీ చిత్రం సూపర్ హిట్ తర్వాత ఆయన సినిమాలన్నీ కూడా అదే రేంజ్ లో ఉండాలి అని చెప్పి ఇప్పటి నుంచే ఆయా సినిమాల పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు. ఇప్పటికే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న థ్యాంక్యూ చిత్రంలోని యావరేజ్ సీన్స్ ను రీషూట్ చేయిస్తున్నాడు. వెరైటీ కాన్సెప్ట్ తో వినూత్నమైన స్టొరీ తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాంతో ఏమాత్రం డల్ అనిపించినా కూడా ఆ సీన్ రీ షూట్ చేయమని చెబుతున్నాడట నాగచైతన్య. 

అలా ఈ సినిమాతో పాటు ఆయన త్వరలో చేయబోయే ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమా స్టోరీని డైలాగ్స్ ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఓకే చెబుతానని చెప్పాడట. ఆ విధంగా ఆయన చేయబోయే సినిమాల పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ సూపర్ హిట్ కొట్టాలన్న కసితో కనిపిస్తున్నాడు. ఇకపోతే ఆయన తాజాగా మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. లేడీ దర్శకులు తక్కువగా ఉన్న టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తన సినిమాల ద్వారా మహిళా దర్శకుల సత్తా చాటింది నందిని రెడ్డి. ఇటీవలే సమంత నటించిన ఓ బేబీ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె అక్కినేని నాగచైతన్య హీరోగా ఓ సినిమా చేయాలని భావించి ఆయనకు ఒక కథ చెప్పగా అది బాగా నచ్చి నాగచైతన్య ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: