మనో అసలు పేరు నాగూర్ బాబు. గుంటూరు జిల్లా సత్తెన పల్లిలోని ఓ ముస్లిం కుటుంబంలో ఆయన పుట్టారు. మనో తల్లిదండ్రులు షహీదా, రసూల్. తన తండ్రి ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు. మనో సింగర్ గా వెలుగులోకి రాకముందు బాలనటుడిగా తన ప్రతిభ కనుబరిచారు. నాగూర్ బాబును మనోగా మార్చిన ఘనత ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకే చెందుతుంది.

మనో కర్ణాటక మ్యూజక్ ను నేదునూరి కృష్ణ మూర్తి దగ్గర నేర్చుకున్నారు. ఇక మనో సహోదరుడు తబలాను వినసొంపుగా  వాయిస్తారు. మనోను మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి దగ్గర చేరుద్దామని చెన్నై తీసుకెళ్లాడు అతడి సోదరుడు. మనో టాలెంట్ ను గుర్తించిన చక్రవర్తి తనదగ్గరే ఉంచుకున్నాడు. అలా నేపథ్య గానంలో నైపుణ్యాన్ని సాధించాడు. టాలీవుడ్ లో నాగూర్ బాబుగా.. కోలీవుడ్ లో మనోగా ఆయన అందరికీ సుపరిచితం. ఇప్పటి వరకు మనో 20వేల పాటలు పాడి సంగీత ప్రియుల మనసు దోచుకున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కు గాత్ర దానం చేసి ఆయన నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. అంతేకాదు బుల్లితెరపై పలు ప్రోగ్రామ్ లు చేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. కర్పూరదీపం అనే చిత్రంలో తొలిసారిగా మనో పాటలు పాడి తన అధృష్టాన్ని పరీక్షించుకున్నారు.

మనోకు ఎక్కువగా బాలు, జేసుదాసు, జానకి, సుశీల, వాణీజయరాం, రఫీ అంటే చాలా ఎక్కువగా అభిమానిస్తారు. అంతేకాదు ఘంటసాల పాటలు అంటే మరీ ఇష్టం. పాక్ సింగర్ గులాం అలీని కూడా ఎక్కువగా ఇష్టపడతారు. నాగూర్ బాబు సర్వకళా వల్లభుడు. నేపథ్య గాయకుడేకాదు. డబ్బింగ్ కళాకారుడు కూడా. ప్రొడ్యూసర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా.. తన ప్రతిభను చాటుతున్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో సుమారు పాతికవేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల మనసు దోచుకున్నారు మనో.

మనో 19ఏళ్ల వయసులో అనగా 1985లోనే పెళ్లి చేసుకున్నారు. తెనాలికి చెందిన జమీలాను ఆ ప్రాంతంలోనే ముస్లిం సంప్రదాయ పద్దతిలో వివాహం  చేసుకున్నారు.  1985 జూన్ 9వ తేదీ మనో వివాహం జరుగగా.. ఆ రోజు ఆయన గురువు కె.చక్రవర్తి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వయంగా వచ్చి సాక్షి సంతకాలు చేయడం విశేషం. మనోకు ఇద్దరు కుమారులు.. ఒక కూతురు ఉన్నారు. మనో పిల్లలు కూడా సినిమాలంటే ఆసక్తి ఎక్కువ. మనో పెద్ద కుమారుడు షకీల్ పలు తమిళ సినిమాల్లో తన ప్రతిభను చాటుతున్నాడు. చిన్న కుమారుడు రతీష్ కూడా పలు సినిమాల్లో తన అధృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇక మనో కూతురు సోఫియా డిగ్రీ చదువుతోంది. సోఫియాకు పాటలంటే చాలా ఇష్టం. అక్కడక్కడ స్టేజ్ షోలలో తన గాత్రాన్ని వినిపిస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: