నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా సెలబ్రిటీ టాక్ షో..? ఇది సాధ్యమేనా? బాలయ్య బయట మాట్లాడితే ఎక్కువగా గొడవలే జరుగుతుంటాయి. అలాంటిది ఒక షో కి హోస్ట్ చేయడం? ఒకవేళ హోస్ట్ చేస్తే ఆ షో ఎలా ఉండబోతోంది అని అందరూ అనుకుంటూ ఉండగానే బాలయ్య అందరికీ సర్ప్రైజ్ చేశాడు. ప్రముఖ ఓటీటీ 'ఆహా' వేదికగా 'అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె' అనే టాక్ షో ని లాంచ్ చేసి.. షో పై అంచనాలను పెంచేశారు. ఇక ఆ అంచనాలను మరింత రెట్టింపు చేస్తూ కేవలం 30 సెకండ్ల నిడివిగల ఓ చిన్న ప్రోమోతో సోషల్ మీడియా ని షేక్ చేసేసాడు బాలయ్య. బుధవారం సాయంత్రం ఈ టాక్ షో కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు ఆహా టీం.

" మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదా లో స్టాప్ ఉండదు.. సై అంటే సై అంటే సై.. నై అంటే నై.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా.. వన్స్ ఐ స్టెపిన్  హిస్టరీ రిపీట్స్" అంటూ బాలయ్య చెప్పిన డైలాగులతో ఈ షో ఎలా ఉండబోతుందో ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఈ ప్రోమో చూసిన ప్రతి ఒక్కరూ ఈ షో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రోమోలో బాలకృష్ణ స్టైల్, ఆయన ఎనర్జీ, కాస్ట్యూమ్స్, సెట్ ప్రాపర్టీస్ దగ్గర్నుంచి ప్రతి ఒక్కటి నెవర్ బిఫోర్ అనేలా ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఈ ప్రోమో చూస్తుంటే బాలయ్య టాక్ షో ముందు ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు, నాగార్జున బిగ్ బాస్ ఏ మాత్రం పనికిరావు.

ఒక ఓటీటీ టాక్ షోకి సినిమా రేంజ్ ఎలిమెంట్స్ అంటే మామూలు విషయం కాదు. అది బాలయ్యకే సాధ్యం అయింది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే బుల్లితెరపై ఏ ఒక్క షో కూడా ఇలాంటి హైట్ నీ క్రియేట్ చేయలేకపోయింది. జస్ట్ ప్రోమో లోనే బాలయ్య ఈ రేంజ్ సందడి చేశాడంటే.. ఇక ఈ టాక్ షో మొత్తంలో సెలబ్రిటీలతో బాలయ్య ఓ ఆట ఆడుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ టాక్ షో ప్రారంభం కానుంది. అందులో మొదటి గెస్ట్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు బాలకృష్ణ తో సందడి చేయబోతున్నారు. ఇక ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, నాగార్జున తదితరులు కూడా ఈ టాక్ షో కి ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది...!!


మరింత సమాచారం తెలుసుకోండి: