
మన్మథుడు సినిమాలో హీరోయిన్లుగా ‘సోనాలి బిండ్రే, అన్షు’ నటించారు. ఇద్దరి పాత్రలు ఎంతో అద్భుతంగా చూపించారు దర్శకుడు కే.విజయ్ భాస్కర్. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికీ విన్నా.. మీరు వింటూనే ఉంటారు. అప్పట్లోనే ఈ సినిమా దాదాపు రూ.10 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. 20 సెంటర్లలో 100 రోజులపాటు సినిమా హౌజ్‌ఫుల్‌గా నడిచింది. మన్మథుడు సినిమా ఇప్పుడు బుల్లితెర మీద వస్తుందంటే చాలు.. ప్రేక్షకులు ఎంతో ఇష్టంగా సినిమాను తిలకిస్తుంటారు.
మన్మథుడు సినిమా కంటే రెండు వారాల ముందు రిలీజ్ అయిన ‘తొట్టి గ్యాంగ్’ సినిమా కూడా మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాలో ‘అల్లరి నరేష్, సునీల్, ప్రభుదేవా’ నటించారు. కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా కమర్షియల్ హిట్ అందుకుంది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సినిమా.. ప్రేక్షకులను ఎంతగానో నవ్వించింది.