బుల్లితెర జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. అనసూయ ప్రస్తుతం ఇటు బుల్లితెరపై అలాగే అటు వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది

సీనిమాలలో కూడా మంచి మంచి పాత్రల్లో నటిస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తాజాగా అనసూయ బంగార్రాజు ప్రీ ఈవెంట్ లో ఎంతో సందడి సందడి చేసింది. నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో అనసూయ ఒక ముఖ్య పాత్రలో సందడి చేసిన విషయం అందరికి తెలిసిందే. కానీ సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా రూపొందిన బంగార్రాజు సినిమాలో మాత్రం అనసూయ అవకాశం దక్కించుకోలేక పోయిందట.

అయితే బంగార్రాజు సినిమా కి అనసూయ కి సంబంధం లేకపోయినా కూడా ఆమె ఈవెంట్ మీ హాజరయ్యిందని సమాచారం.. రాము బావ అంటూ సోగ్గాడే చిన్నినాయన సినిమా లో బుజ్జిగా అనసూయ అదరగొట్టిందట.. ఇక స్టేజ్ పై బంగార్రాజు సినిమాల్లో తనకు ఎందుకు పాత్ర ఇవ్వలేదు అంటూ స్టేజ్ పైనే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ని నిలదీసిందట అనసూయ అయితే సినిమాలో అనసూయ పెట్టుకోకపోవడానికి చెప్పిన కారణమే ఇప్పుడు అందరి ముందు చెప్పమంటూ దర్శకుడికి ఆర్డర్ కూడా వేసిందట.అయితే చిన్న బంగార్రాజు కు పిన్ని పాత్ర అవుతుందని ఏజ్ ఎక్కువగా చూపించాల్సి వస్తుంది అని అలాంటి పాత్ర చేస్తారా అని అడిగాను అందుకే వద్దన్నాను అంటూ కళ్యాణ్ కృష్ణ చెప్పుకొచ్చారట.

ఇక తన వద్ద మాత్రం కళ్యాణ్ కృష్ణ వేరే కారణం చెప్పాడని  ముసలి పాత్ర ఎందుకు లే నీకోసం సపరేట్ గా బుజ్జి అనే ఒక వెబ్ సిరీస్ చేద్దామంటూ బిస్కెట్ కూడా వేశాడు అని చెప్పుకొచ్చింది అనసూయ. అంత పెద్ద బిస్కెట్ ఎవరైనా చేస్తారా అంటూ బాగా సందడి సందడి చేసింది. ఏడవలేక ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నాను సినిమాలో నన్ను ఎందుకు పెట్టుకోలేదు అని ఎప్పుడూ అడుగుతూనే ఉంటాను నీ కల లోకి కూడా వస్తాను అంటూ దర్శకుడిని ఒక ఆట ఆడుకుందట అనసూయ. అనంతరం అనసూయ మాట్లాడుతూ సినిమా పై పాజిటివ్ గా కామెంట్ కూడా చేసింది. సినిమా ట్రైలర్ ని నాలుగైదు సార్లు చూశాను అని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు అనసూయ తెలిపిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: