మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ఎలాంటిదో ప్రతి తెలుగు ప్రేక్షకునికి తెలుసు. ఒకప్పుడు ఆయన సినిమా వస్తుందంటే ఏ హీరో సినిమాకి కూడా లేని హడావిడి హంగామా ఆయన సినిమాకి ఉంటుంది. ప్రతి ఒక్క నటీ నటులు ఆయనతో తమ జీవితంలో ఒక్క సారైన నటిస్తే బాగుండు అని కోరుకుంటారు.అంతటి క్రేజ్ ఇంకా స్టార్ డం మెగాస్టార్ చిరంజీవి ఆయన సొంతం. అందుకే సుధీర్ఘ కాలం పాటు ఆయన నెంబర్ వన్ హీరోగా టాలీవుడ్ ని ఏలాడు. ఇక అప్పటి కుర్ర హీరోయిన్లు అయితే మెగాస్టార్ తో ఒక్క ఛాన్స్ కోసం ఎంతగానో వెయిట్ చేసేవారు. కాని ఇప్పుడు వున్న కుర్ర హీరోయిన్స్ మాత్రం అసలు మెగాస్టార్ తో ఛాన్స్ వచ్చిన సింపుల్ గా నో చెప్పేస్తున్నారు. ఇక మెగాస్టార్ రీఎంట్రీ నుండి వరుస సినిమాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కుర్ర దర్శకులకు ఆయన చాలా అవకాశాలు ఇస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవికి హీరోయిన్‌ని వెతకడం ఇప్పుడు కాస్త కష్టమే అవుతోంది. ఆయన ప్రతి సినిమాకి ముందు కూడా కథానాయిక ఎవరబ్బా ? అంటూ పెద్ద చర్చే సాగుతుంది. ఇక లేటెస్ట్ సినిమాకి కూడా హీరోయిన్స్ దొరకలేక ఈసారి కూడా చిరు సినిమాకి త్రిష లాంటి ముదురు హీరోయిన్ నే సెట్ చేశారు.

చిరు కొత్త సినిమాలో త్రిష నాయికగా చేస్తుంది అంటూ ఓ రూమర్‌ లేస్తుంది. అయితే ఆమె కూడా నటించడం లేదు అంటూ క్లోజ్‌ అయిపోతుంది. ఇక తాజాగా వెంకీ కుడుముల సినిమాకు త్రిష పేరే వినిపిస్తోంది.మెగాస్టార్ తో వెంకీ కుడుముల ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా కూడా అనౌన్స్‌ చేశారు. అప్పటికే సినిమా కథ పాయింట్ చెప్పి ఓకే చేసుకున్న వెంకీ. ఇప్పుడు ఆ కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేసే పనిలో కూడా పడ్డాడట. ఈ క్రమంలో ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరు అనే ప్రశ్న మొదలైంది.దీంతో కుర్ర హీరోయిన్లు ఒప్పుకోకపోవడంతో  సీనియర్‌ నాయికల పేర్లు వరుసపెడుతున్నారట. నయనతార, కాజల్‌, తమన్నా, శ్రుతి హాసన్‌ ఇంకా త్రిష అంటూ పేర్లు చూస్తుంటే త్రిష పేరు దగ్గర ఆగారట.కాని త్రిష కూడా ఇందుకు యస్ చెప్తుందో నో చెప్తుందో అన్న క్లారిటీ ఇంకా రాలేదట. కథ సాటిస్ ఫై చేస్తే త్రిష ఒకే చెప్పే అవకాశం ఉందంట. చూసారా ఒకప్పుడు మెగాస్టార్ తో నటిస్తే చాలు అనుకునే హీరోయిన్లు ఇప్పుడు ఆయనని తక్కువగా చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: