కోలీవుడ్ స్టార్ సీనియర్ హీరో అయిన కమల్ హాసన్ కి ప్రస్తుతం స్టార్హీరోల రేంజ్ మార్కెట్ లేదు. ప్రస్తుతం సినిమాల్లో ఎలాగూ మార్కెట్ తగ్గడంతో సైడ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ సీనియర్ హీరో. ఆ మధ్య కమల్ హాసన్ వస్త్ర వ్యాపారం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ వ్యాపారంలోకి అడుగు పెట్టడానికి కారణమే కమల్ కి ఆ వస్త్రాల పై మంచి పట్టు ఉండటం. అయితే ఇప్పుడు తాజాగా కమల్ హాసన్ తన పేరుపై క్లాతింగ్ లేబుల్ ని లాంచ్ చేసి ఖద్దరు బట్టలు కూడా అమ్ముతూ వాటిని ఫుల్ క్యాష్ చేసుకునే పనిలో పడ్డాడు. ఈ మేరకు నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా ఒక సరికొత్త వెబ్ సైట్ కూడా లాంచ్ చేశాడు కమల్హాసన్.

తన కంపెనీకి సంబంధించిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే.. ఆ చోటుకు వెంటనే డెలివరీ కూడా చేస్తామని కమల్ హాసన్ తన బట్టల దుకాణాన్ని బాగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. కాకపోతే కమల్హాసన్ తయారు చేసే బట్టలను బుక్ చేసుకోవాలి అంటే కాస్త పెద్ద మొత్తంలోనే చెల్లించుకోవాలి. కమలహాసన్ తయారు చేసే ఖద్దరు వస్త్రాలను కొనుక్కోవాలంటే భారీ మొత్తంలోనే ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఇక ఈయనతో పాటు ఇప్పటికే బట్టల వ్యాపారంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరో సమంత తో సహా పలువురు హీరోలు, హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే వారిలో కమల్హాసన్ వస్త్ర వ్యాపారం మాత్రం చాలా ప్రత్యేకమైనదని చెప్పుకోవాలి.

ఎందుకంటే కమల్ హాసన్ కేవలం మగ్గాలపై నేసిన చేనేత వస్త్రాలను మాత్రమే అమ్ముకున్నాడు. పైగా వీటిలో సింథటిక్ రంగులు అలాంటివి అస్సలు వాడడం లేదు. అంటే పూర్తిగా నేచురల్ డయింగ్ బట్టలను రెడీ చేస్తున్నాడు కమల్. అందుకే కమల్ హాసన్ తన దుస్తుల బ్రాండ్ను చాలా సీరియస్ గా ప్రమోట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ బట్టల వ్యాపారం లో కమల్ హాసన్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. మరోవైపు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈ సీనియర్ హీరో 'విక్రమ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ భారీ రెస్పాన్స్ ని కనబరిచింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇక ఈ సినిమాతో పాటు శివకార్తికేయన్ నటించే తదుపరి సినిమాని నిర్మాతగా కమల్ హసన్ నిర్మించబోతున్నాడు...!!



మరింత సమాచారం తెలుసుకోండి: