సౌత్‌లో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న నయనతార 17 ఏళ్ల కెరీర్‌లో బాలీవుడ్ నుంచి ఎన్ని ఆఫర్స్ వచ్చినా ముంబయి వెళ్లలేదు. తెలుగు, తమిళ్, మళయాళీ సినిమాలతోనే బిజీ అయింది. కానీ ఆమెకి 'రాజారాణి'తో సెకండ్ ఇన్నింగ్స్‌కి స్ట్రాంగ్ బేస్ వేసిన అట్లీ అడగ్గానే హిందీకి వెళ్లడానికి ఓకే చెప్పింది. అట్లీ బాలీవుడ్ ఫస్ట్ మూవీకి సైన్ చేసింది. ఈ మూవీలో షారుక్ ఖాన్ జోడీగా నటిస్తోంది నయన్.
అమలాపాల్ డివోర్స్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌తో మళ్లీ బిజీ కావాలని చాలా ట్రై చేస్తోంది. 'ఆమె' లాంటి సినిమాల్లో బోల్డ్ రోల్స్ ప్లే చేసింది. అయితే అమలాకి మాత్రం సరైన బ్రేక్ రాలేదు. ఇలాంటి టైమ్‌లో 'రంజిష్ హీ సహీ' అనే సినిమాతో బాలీవుడ్‌కి వెళ్లింది. ఈమూవీలో ఒకప్పటి హీరోయిన్ పర్వీన్ బాబీ క్యారెక్టర్ ప్లే చేసింది. రెండేళ్ల క్రితమే అమలాపాల్ హిందీలో అర్జున్ రామ్‌పాల్‌తో ఒక మూవీకి సైన్ చేసింది. కానీ ఎందుకో ఈ సినిమా పట్టాలెక్కలేదు. మొత్తానికి మన హీరోయిన్లకు బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఏర్పడింది.కొత్త అందాలను వెండితెరపై చూపించేందుకు అక్కడి వారు ఆసక్తి చూపిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి