ఒకవైపు వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇచ్చే హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఇంకా కూతురు సితారకు మహేష్ లాగానే సోషల్ మీడియాలో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇక మహేష్ కొడుకు గౌతమ్ ఇప్పటికే 1 నేనొక్కడినే సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకోగా సితార కూడా భవిష్యత్తులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తారనే కామెంట్లు అభిమానులు నుంచి వినిపిస్తున్నాయి.బాల కృష్ణ హోస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ గెస్ట్ గా హాజరైన అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ బాగా వైరల్ అవుతుంది. ఇక ఈ టాక్ షోలో మహేష్ మాట్లాడుతూ తాను సినిమాలలో యాక్ట్ చేస్తానని తన స్కూల్ లో ఎవరికీ చెప్పలేదని అన్నారు.

ఎవరికైనా చెబితే తెలుగు సినిమాలలో యాక్టింగ్ చేస్తున్నావా అని టీజ్ చేసేవాళ్లని సూపర్ స్టార్ మహేష్ బాబు వెల్లడించారు. చిన్నప్పుడు సెలవుల్లో తన నాన్న సూపర్ స్టార్ కృష్ణ ఏదో ఒక సినిమాలో తనతో యాక్టింగ్ చేయించేవారని మహేష్ అన్నారు.సమ్మర్ లో తన తండ్రి కృష్ణ సినిమాల షూటింగ్ ఊటీలో జరిగేదని తాను చిన్నప్పుడు వాళ్ళ నాన్నతో కలిసి నటించిన సినిమాలు మంచి సక్సెస్ సాధించాయని మహేష్ బాబు వెల్లడించారు. దాసరి నారాయణరావు డైరెక్షన్ లో తెరకెక్కిన నీడ సినిమా తను నటించిన తొలి సినిమా అని తను నటించిన సినిమాలు సక్సెస్ కావడంతో చైల్డ్ స్టార్ అయ్యాడని తనపై అప్పట్లో కామెంట్లు వచ్చాయని సూపర్ స్టార్ మహేష్ తెలిపారు. మహేష్ బాబు డీసెంట్ అనుకుంటే గౌతమ్ డీసెన్సీ కా బాప్ అని బాల కృష్ణ చెప్పగా సూపర్ స్టార్ మహేష్ నవ్వారు.

మరింత సమాచారం తెలుసుకోండి: