అలా కనిపించడం కోసం అల్లు అర్జున్ తీవ్రంగా శ్రమించినట్లు కనిపిస్తోంది.. పుష్ప టీం సభ్యులు అల్లు అర్జున్ మేకోవర్ గురించి తెలియజేస్తూ ఒక వీడియోను కూడా షేర్ చేశారు. అల్లు అర్జున్ క్రూరమైన పుష్ప రాజ్ మేకోవర్ చూడండి అంటూ తెలియజేయడం జరిగింది. స్టైలిష్ స్టార్ పుష్పరాజ్ పాత్రకి తగ్గట్టు గానే మేకప్ వేసుకోవడానికి చాలా శ్రమించాడు అని ఈ వీడియో చూస్తే మనకు తెలుస్తుంది.. అల్లు అర్జున్ డీ గ్లామరస్ పాత్రలో కూడా బాగా కనిపించారు. ఇక అల్లుఅర్జున్ ఒకరోజు వారి కూలి పాత్రలో కనిపించేందుకు.. కాస్త బరువు కూడా పెరిగినట్లు తెలుస్తోంది.
చిత్తూరు బాషలో మాట్లాడేందుకు స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.. నిత్యం పుష్ప రాజు క్యారెక్టర్ లోనే తనని తాను మెస్మరైజింగ్ చేసుకుంటూ చాలా కష్టపడుతున్నారు అని సమాచారం. ఇక షూటింగ్ మొత్తం ఎక్కువగా అడవుల్లోనే చేయడంతో ఈ సినిమాలో ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ మూవీలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. అయితే పుష్ప మూవీ లో కూల్ గా తన జీవితాన్ని ప్రారంభించిన పుష్ప రాజ్.. ఇక ఎలా ఎదుగుతాడు అనే విషయం పార్ట్ 2 లో చూపించబోతున్నారు సుకుమార్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి