ఈ క్రమం లో జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారును సైతం ఎంత సర్ది చెప్పాలి అని చూసినా వినకుండా పోలీసులు కారును ఆపి బ్లాక్ ఫిల్మ్ ను తొలగించినట్లు సమాచారం. ఆ సమయంలో కారులో హీరో ఎన్టీఆర్ తో పాటు తనయుడు అభి మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని సార్లు ప్రభుత్వం పెట్టే నియమ నిబంధనల ముందు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సమాధానం చెప్పాల్సిందే. వారి తనిఖీకి సహకరించక తప్పదు. సరిగ్గా ఎన్టీఆర్ కూడా ఇక్కడ ఇదే చేశాడు. కాగా ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం మరో మూడు రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు.
అదే విధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ ను మరియు మేరాజు హుస్సేన్, ఏపీకి చెందిన శ్రీధర్ రెడ్డి పేరుతో ఉన్న స్టిక్కర్లను కూడా ఉన్నటువంటి ఆయా వాహనాలను కూడా తొలగించి తమ కర్తవ్యాన్ని తాము నిర్వహించారు పోలీసు అధికారులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి