తెలుగు
సినిమా పరిశ్రమలో భారీ స్థాయిలో ఫాన్స్ ను కలిగిన
హీరో ఎన్టీఆర్. ఆయన హీరోగా నటించిన
ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని ఆయనకు తెచ్చి పెట్టింది అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో ఆయన నటించిన నటనకు ప్రేక్షకులు అందరూ కూడా ఎంతగానో
ఫిదా అయిపోయారు. ఆయనకు అభిమానులు కాని వారు సైతం
ఎన్టీఆర్ కు అభిమానులు అయిపోయారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో తమ అభిమాన
హీరో ప్రాధాన్యత చాలా తగ్గించాలని రాజమౌళిపై ఆయన అభిమానులు మండిపడ్డారు.
సినిమా విడుదలకు ముందు నుంచే
ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి తమకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని చెప్పి ఆయన అభిమానులు విమర్శలు చేయడం ప్రారంభించారు. ఆ విధంగా
ఎన్టీఆర్ అభిమానులు అనుకున్నట్లుగానే ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా తక్కువగా ఉన్నట్లు అందరూ భావిస్తున్నారు. ఈ
సినిమా లో మరో హీరోగా నటించిన
రామ్ చరణ్ తో పోలిస్తే
ఎన్టీఆర్ పాత్ర ఆయన కంటే చాలా తక్కువగా ఉందని ఇది
ఎన్టీఆర్ ను అవమానించినట్లే అప్పటి నుంచి
రాజమౌళి పై విమర్శలు చేస్తూ వచ్చారు
ఎన్టీఆర్ అభిమానులు.
ఇక ఈ
సినిమా విడుదలై నెల రోజులు అవుతున్నా కూడా
ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయమై ఇంకా ఫీల్ అవుతూ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఈ
సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో
ఎన్టీఆర్ అభిమానులకు ఇప్పుడు పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు కాబట్టి తదుపరి సినిమాల విషయంలో అయినా
ఎన్టీఆర్ తగు జాగ్రత్తలు తీసుకునేలా అభిమానులు ఆయనకు సూచించారని కొంతమంది చెబుతున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టడానికి
ఎన్టీఆర్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే మొదలు కావాల్సిన ఈ
సినిమా ఆలస్యం అవుతూ ఉండగా ఎన్టీఅర్ అభిమానులు ఆలస్యం పై గోల గోల చేస్తున్నారు.