టాలీవుడ్ లో ఎవరూ కూడా డైరెక్ట్ గా మెగా ఫోన్ పట్టుకునే అవకాశం రాదు. దానికి ముందు సినిమా పరిశ్రమలో ఏదో ఒక విభాగంలో కొంత అనుభవం ఘడించాలి. అప్పుడే డైరెక్షన్ గురించి నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇప్పటి వరకు వచ్చిన డైరెక్టర్ చాలా వరకు ఒక రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి డైరెక్టర్ గా మారినవారే ఉన్నారు. అదే విధంగా ప్రస్తుతం 'సర్కారు వారి పాట'కు దర్శకత్వం వహించిన పరుశురాం మొదట్లో తన బంధువైన డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. అలా వచ్చిన అనుభవంతో 2008 లో నిఖిల్ సిద్దార్ధ్ హీరోగా అక్ష హీరోయిన్ గా యువత అనే సినిమాను తెరకెక్కించాడు.

సినిమా పెద్ద హిట్ కాకపోయినా అందరినీ ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత అంజనేయులు, సోలో సినిమాలతో హిట్ కొట్టి, మళ్ళీ వరుసగా సారొచ్చారు తో ప్లాప్ ను చవిచూశాడు. ఆ తర్వాత మళ్ళీ అల్లు శిరీష్ తో శ్రీరస్తు శుభమస్తు ను తీసి పర్వాలేదు అనిపించుకున్నాడు. అప్పుడే ఫామ్ లో ఉన్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ కు కథ చెప్పి ఒప్పించాడు. అలా 2018 లో గీత గోవిందం తెరకెక్కింది. ఈ సినిమా ఎంత హిట్ అయింది అంటే... టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయి కూర్చుంది. వరుసగా అటు విజయ్ కి, రష్మిక కి మరియు డైరెక్టర్ పరుశురాం కి ఆఫర్లు క్యూ కట్టాయి.

అయితే పరుశురాం మాత్రం ఒక మంచి కథను తయారుచేసుకుని ప్రిన్స్ మహేష్ ను కలిసి ఒప్పించాడు. అలా మహేష్ బాబు సర్కారు వారి పాట మొదలైంది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. మరి పరుశురాం కెరీర్ లో ఇప్పటి వరకు తీసిన సినిమాలు మొత్తం 6 కాగా, అందులో నాలుగు సినిమాలు సూపర్ హిట్ అయితే, ఒకటి యావరేజ్ ఇంకొకటి ప్లాప్ గా నిలిచింది. కాబట్టి ఇలా పరుశురాం కెరీర్ రికార్డు చూస్తే 'సర్కారు వారి పాట' ఖచ్చితంగా హిట్ అవుతుందని తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: