సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. గురువారం నాడు విడుదలైన మహేష్ (Mahesh Babu)మూవీ లాంగ్ వీకెండ్ దక్కించుకోగా.. రెండవ రోజుకు మించిన కలెక్షన్స్ మూడో రోజు ఫుల్ గా రాబట్టింది.సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా దూకుడు చూపిస్తుంది. పాక్షిక సెలవు దినం శనివారం నాడు ఈ సినిమా కలెక్షన్స్ బాగా జంప్ అయ్యాయి. శుక్రవారం రోజుతో పోల్చితే శనివారం నాడు  ఈ సినిమా మెరుగైన వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఫస్ట్&సెకండ్ షోలకు అయితే ప్రేక్షకులుబాగా పోటెత్తారు.ఇక ఫస్ట్ డే నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ రికార్డు వసూళ్లు సాధించిన సర్కారు వారి పాట (SVP Collections) సినిమా సెకండ్ డే వసూళ్ల పరంగా కొంచెం నెమ్మదించింది. హైదరాబాద్ సిటీ మినహాయిస్తే నైజాంలో భారీ డ్రాప్ అనేది కనిపించింది.ఎందుకంటే శుక్రవారం నాడు వర్కింగ్ డే నేపథ్యంలో కలెక్షన్స్ కొంచెం తగ్గాయి.



అయితే మూడో రోజు శనివారం నాడు సర్కారు వారి పాట కలెక్షన్స్ పుంజుకున్నాయి.మొదటి రోజు రూ. 75 కోట్లు సెకండ్ డే రూ. 28 కోట్ల వసూళ్లు చేసిన ఈ సినిమా మూడో రోజు 29 కోట్లు వసూలు చేసింది. ఇక టోటల్ గా మూడు రోజులు కలిపి ఈ సినిమా 132 కోట్ల వసూళ్లు రికవరీ చేసింది.ఇక యూఎస్ లో లేటెస్ట్ సమాచారం మేరకు $1.8 మిలియన్ డాలర్లు పైగా వసూళ్లు సాధించింది. అక్కడ భీమ్లా నాయక్ ఇంకా అలాగే పుష్ప లైఫ్ టైం వసూళ్లను సర్కారు వారి పాట సినిమా దాటేసే అవకాశం కలదు.అలాగే షేర్ విషయానికి వస్తే..89 కోట్ల షేర్ రాబట్టి భీమ్లా నాయక్, ఆచార్య లాంటి సినిమాల లైఫ్ టైం వసూళ్ళని మూడు రోజుల్లోనే దాతీసింది. నిజంగా ఇది పక్కా సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ క్రేజ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

SVP