ఇక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా అనే పదం వచ్చాక నటీనటుల మధ్య ఇండస్ట్రీ ల మధ్య చాలా భారీ ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. ఈ పాన్ ఇండియా నేపథ్యంలో సౌత్ సినిమాలు విజయం సాధించడంలో పరిస్థితి ఏమో గాని… సౌత్ ఇంకా నార్త్, ప్రాంతీయ భాష- జాతీయ భాష అనుకుంటూ నటీ నటులు ఇంకా స్టార్ హీరోలు ఒకరిపై మరొకరు అనేక రకాల కామెంట్లు చేసుకుంటున్నారు.ఇక ఇటీవలే హిందీ భాష గురించి సుదీప్ చేసిన కామెంట్లకు బాలీవుడ్ స్టార్ హీరోలు భారీ ఎత్తున రియాక్ట్ కావడం కూడా తెలిసిందే. ఆ తర్వాత “మేజర్” సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో కూడా బాలీవుడ్ తనని భరించలేదని మహేష్ చేసిన కామెంట్స్ కూడా పెను దుమారాన్ని రేపాయి.ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా మేజర్ సినిమా త్వరలో రిలీజ్ కాబోతున్న తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న యంగ్ హీరో అడవి శేష్ చేసిన కామెంట్లు అయితే మరింత విమర్శలకు దారి తీసింది.ఇక ఈ సినిమా ముంబై తాజ్ హోటల్ దాడులు 26/11 నేపథ్యంలో తీసిన సినిమా కావడంతో… ముంబాయిలో అడవి శేష్ ఇంకా అలాగే సినిమా యూనిట్ మీడియా సమావేశం ఇటీవల నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా విలేఖరి అడివి శేష్ కి అదిరిపోయే ప్రశ్నని వేశారు. మేజర్ తో పాటు కమల్ హాసన్ నటించిన “విక్రమ్” ఇంకా హిందీలో అక్షయ్ కుమార్ నటించిన “పృథ్వీరాజ్”.. ఒకేసారి బాక్సాఫీస్ వద్ద విడుదల అవుతున్నాయి. దీనిపై మీ స్పందన ఏమిటి అని వారు ప్రశ్నించారు. దీనికి అడవి శేష్ సమాధానమిస్తూ… గత రెండు సంవత్సరాలు పాండమిక్ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకోవడం జరిగిందో అందరికీ కూడా తెలుసు.అయితే కమల్ ఇంకా అక్షయ్ కుమార్ సినిమాలు సముద్రంలో పెద్ద చేపలు వంటివి. ఇక మేజర్ సినిమా విషయానికొస్తే ఇది గోల్డెన్ ఫిష్ అంటూ తనదైన శైలిలో కామెంట్లు చేశారు. ఇక అడివి శేష్ ఇచ్చిన సమాధానానికి.. కొంతమంది పాజిటివ్ గా రియాక్ట్ అయితే మరికొంతమంది మాత్రం నెగిటివ్ గా తీసుకుంటున్నారు. కమల్ ఇంకా అక్షయ్ కుమార్ ప్యాన్స్ కొంతమంది మండిపడుతున్నారు. సీనియర్ హీరోలకి రెస్పెక్ట్ అనేది ఇవ్వడం లేదు. అడవి శేష్ చేసిన కామెంట్లు సీనియర్ హీరోల సినిమాలను చాలా తక్కువ చేసినట్టు ఉందని రియాక్ట్ అవుతున్నారు.అలాగే మరోపక్క కర్ర విరగకుండా పాము చచ్చిపోయే రీతిలో..బాలీవుడ్ విలేకరికి చాలా తెలివిగా సమాధానం ఇచ్చారని మరి కొంతమంది అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక జూన్ 3 వ తేదీనా మేజర్ సినిమా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: