నాలుగు ఫ్లాపులొచ్చాక విజయ్‌తో సినిమా చేస్తా'..అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు యువ దర్శకుడు అయిన తరుణ్ భాస్కర్ 


టాలీవుడ్ రౌడీ హీరోగా ఇప్పుడు విపరీతంగా క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన మొదటి సినిమా 'పెళ్లి చూపులు' (Pelli Choopulu). తెలుగమ్మాయి రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ దర్శకుడిగా పరిచయమయ్యిన విషయం తెలిసిందే.చాలా తక్కువ బడ్జెట్‌తో 'పెళ్లి చూపులు' నేపథ్యంలో తెరక్కిన ఈ సినిమా మంచి కమర్షియల్ విజయంను సాధించింది.


సినిమా తర్వాత విజయ్ దేవరకొండ 'ద్వారక', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' లాంటి సినిమాలు చేసి స్టార్‌ హీరోగా మారాడు. ఇక తరుణ్ భాస్కర్ 'ఈ నగరానికి ఏమైంది' సినిమాను తీసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ప్రముఖ ఓటీటీఒ నెట్‌ఫ్లిక్స్ కోసం చేసిన 'పిట్టకథలు' వెబ్ సిరీస్ కూడా ఈ యంగ్ డైరెక్టర్‌కు మంచి పేరునే తెచ్చిపెట్టింది. నటుడిగానూ మంచి పాత్రలు పోషిస్తూ సత్తా చాటుతున్న తరుణ్ భాస్కర్ త్వరలో వెంకటేశ్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడని సమాచారం..


అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన తరుణ్ భాస్కర్ 'పెళ్లి చూపులు' సినిమా సమయంలో జరిగిన సంఘటనల గురించి..అలాగే, మళ్ళీ విజయ్ దేవరకొండతో సినిమా ఎప్పుడు చేస్తారు..? అనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడట.. 'విజయ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాంటివాడని చెప్పుకొచ్చాడు. నాలుగు ఫ్లాపులొచ్చాక గానీ తనతో చేస్తా'.. అని సమాధానమిచ్చాడట  తరుణ్ భాస్కర్. అయితే, ఆ ఫ్లాపులు ఎవరికీ అని అడగగానే తనకే అని చెప్పాడట.. అంటే ఫ్లాపుల్లో ఉన్నప్పుడు తనకి విజయ్ తప్పకుండా సినిమా చేసే ఛాన్స్ ఇస్తాడనే నమ్మకాన్ని ఆయన తెలిపాడు. ఇక 'పెళ్లి చూపులు' షుటింగ్ సమయంలో ట్రక్‌కి బ్రేకులు ఫేయిల్ అందరం కంగారు పడుతుంటే తను మాత్రం చాలా రిలాక్స్డ్‌గా కూర్చున్నాడని .అలా ఎలా ఉండగలిగావు..అని అడిగితే..'ఏముంది అందరం కలిసి చచ్చిపోతాము కదా'.. అని అన్నాడు..అంటూ మెమరీస్‌ను గుర్తు చేసుకున్నాడట తరుణ్.ప్రస్తుతం తరుణ్ భాస్కర్ చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: