ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఫుల్ ఫాంలో ఉన్నాడనే చెప్పాలి. వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతూ టాలీవుడ్ ని నెంబర్ 1 హీరోగా ఏలుతున్నాడు సూపర్ స్టార్ మహేష్. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరూ ఇక రీసెంట్ గా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దుమ్ముదులుపుతున్న సర్కారు వారి పాట సినిమాలతో మహేష్ దూసుకుపోతున్నాడు. ఈ సినిమాతో రికార్డు వసూళ్లు కొల్లగొట్టి టాలీవుడ్ క్రౌడ్ పుల్లర్ హీరో అని మరోసారి నిరూపించుకున్నాడు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఫ్యాన్స్ తో పాటు యాంటి ఫ్యాన్స్ కూడా ఎక్కువైపోయారు. అలాగే యాంటి ఫ్యాన్స్ తో పాటు యాంటి మీడియా వెబ్ సైట్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. నిర్మాతలు వెల్లడించిన అధికారిక వసూళ్ళని పక్కన పెట్టి తమ ఇష్టం వచ్చినట్లుగా సర్కారు వారి పాట వసూళ్ళని తక్కువ చేస్తూ ఇష్టమొచ్చిన కథనాలు రాస్తున్నాయి కొన్ని మీడియా వెబ్ సైట్ లు. అందువల్ల ఆ సైట్లపై మహేష్ ఫ్యాన్స్ విపరీతంగా కోపంగా వున్నారు. పచ్చి బూతులు తిడుతున్నారు. సినిమా అంత బాగున్నా కూడా నిర్మాతలు అధికారికంగా వసూళ్లు ప్రకటించినా కూడా వసూళ్లు తగ్గిస్తూ తప్పుడు లెక్కలతో ఆర్టికల్స్ రాస్తున్న కొన్ని మీడియా సైట్లని దారుణంగా తిడుతున్నారు మహేష్ ఫ్యాన్స్. సినిమాకి వచ్చిన వసూళ్లు ఏంటి మీరు రాసి పబ్లిష్ చేస్తున్న తప్పుడు ఆర్టికల్స్ ఏంటని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నిజానికి సర్కారు వారి పాట సినిమాకు కేవలం 12 రోజుల్లోనే 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు ఇంకా 122 కోట్లకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ విషయాన్ని నిర్మాతలతో పాటు నేషనల్ మీడియా సైట్స్ కూడా తెలియజేశాయి. కానీ కొన్ని తెలుగు మీడియా సైట్స్ వసూళ్ళని తగ్గించి ఆర్టికల్స్ రాయడం చాలా విచారకరం అని చెప్పాలి. మన ప్రాంతీయ తెలుగు సినిమా గురించి జెన్యూన్ గా వసూళ్ల వివరాలని తెలుపుతూ నేషనల్ మీడియా సైట్స్ చాలా గొప్పగా మన తెలుగు సినిమాలను మెచ్చుకుంటూ కథనాలు రాస్తుంటే కొన్ని లోకల్ మీడియా సైట్స్ మాత్రం ఇలా తక్కువ లెక్కలు చూపిస్తూ తప్పుదోవ పడుతున్నాయంటూ ఆ సైట్లపై మహేష్ అభిమానులు మండిపడుతున్నారు. చిత్ర బృందం వారు అధికారికంగా ప్రకటించిన వసూళ్ల వివరాలు ఇలా వున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: