జయలలిత ఈమె ప్రస్తుతం సీరియల్స్ లలో బిజీ అయ్యారు.. కానీ ఒకప్పుడు మాత్రం సినిమాల్లో నటించారు. ఇప్పటికీ మనచి అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానని అంటుంటారు. సినిమాల్లో ఎక్కువగా మొదట్లో డాన్ క్యారెక్టర్ లలో ఆ తర్వాత లేడీ కమిడియన్ గా ఆ తర్వాత... క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా చాలా పాత్రలే చేశారు. ఇలా ముప్పై ఏళ్లకు పైగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు నటి జయలలిత. అయితే తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న ఈమె తన సినీ జీవితానికి సంబందించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తన సినీ ప్రస్థానంలో ఎన్నో ఘోరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారట. ఈమె వినోద్ అనే డైరెక్టర్ ని పెళ్లి చేసుకున్నారు కానీ ఆ బంధం ఎక్కువ కాలం నిలబడలేదు అని చెప్పుకొచ్చారు.

దాదాపు ఏడేళ్ల పాటు  వీరిద్దరూ ప్రేమించుకున్నారట. ఆ డైరెక్టర్ భక్తి సినిమాలతోపాటు బి గ్రేడ్ సినిమాలు కూడా డైరెక్ట్ చేసేవారట. జయలలిత కూడా ఆయన తీసిన పలు బి గ్రేడ్ సినిమాలలో హీరోయిన్ గా నటించింది. అలా వీరిద్దరి మద్య సాన్నిహిత్యం పెరిగి చివరికి పెళ్లి వరకు నడిచింది. అయితే పెళ్లయిన రెండేళ్లకే విడిపోయారట. జయలిత ఇంట్లో ఆ డైరెక్టర్ తో పెళ్లికి అస్సలు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో తన సొంత డబ్బులతో అన్ని ఏర్పాట్లు చేసుకుని పెళ్లి చేసుకున్నారట జయలలిత. అయితే అతడు కేవలం డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకున్నాడు అని తెలియడం తో విడిపోయామని చెప్పుకొచ్చారు.
 
ఆమె ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ళలో దిగ్గజ దర్శకుడు విశ్వనాధ్... జయలలిత తో బ్రాహ్మణ అమ్మాయివి, మంచి చదువు డిగ్రీ చదివావు, అలాగే మంచి డాన్సర్ వి, సినిమాల్లోకి ఎందుకు వచ్చావు మంచి అబ్బాయిని చూసి  పెళ్లి చేసుకో అని సలహా కూడా ఇచ్చారట. అయితే సినిమా పై ఉన్న మక్కువతో ఇండస్ట్రీకి వచ్చినట్లు తెలిపారు.
అలా ఇండస్ట్రీలోకి వచ్చాక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు అని తెలిపారు. ప్రస్తుతం జయలలిత ఎవరిని పెళ్లి చేసుకోకుండానే సింగిల్ గానే లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. జయలలితతో పాటుగా ఆమె మేనమామ కొడుకు భాస్కర్ కూడా తనతోనే ఉంటూ ఆమె డేట్స్ వంటి పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: