
విలక్షణమైన నటుడుగా విజయ్ సేతుపతి పేరు పొందారు ఇటీవల కాలంలో మంచి క్రేజీలు సంపాదించుకున్నాడు కేవలం సౌత్ ఇండస్ట్రీ లో మంచి డిమాండ్ అయితే ఏర్పడిందని చెప్పవచ్చు ఒకప్పుడు కేవలం తమిళంలోని బిజీగా ఉండే విజయ్ సేతుపతి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా బిజీ హీరోగా మారిపోయారు. కేవలం విలన్ రోల్స్ మాత్రమే చేస్తూ తను నటించే పాత్రకు ఏమాత్రం తగ్గకుండా నటిస్తూ ఉంటాడు ముఖ్యంగా అగ్ర హీరోల సినిమాలలో ప్రతి నాయకుడు పాత్రలో అద్భుతంగా నటిస్తూ ఉన్నాడు విజయ్ సేతుపతి.
ఒక రకంగా చెప్పాలి అంటే హీరోగా కంటే విలన్ గాని ఎక్కువ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉన్నాడు. రీసెంట్ గా కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో నటించిన విధానం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే విజయ్ సేతుపతి మళ్లీ మరొకసారి మరొక సినిమాతో రాబోతున్నాడు ఆ చిత్రమే 19(1) A అని డిఫరెంట్ టైటిల్ తో ఒక చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని హిందూ దర్శకత్వం వహించారు ఈ సినిమా థియేటర్లో విడుదల కావడం లేదు డైరెక్ట్ గా ఓటీటి లోనే విడుదలవుతోంది.
విజయ్ సేతుపతి తన సోషల్ మీడియా ప్రొఫైల్ ద్వారా ఈ సినిమాని ott ప్లాట్ ఫామ్ అయినా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. అయితే ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు ఈ సినిమాలో ఇంద్రజిత్ సుకుమార్ తదితరులు కీలకమైన పాత్రలు నటించడం జరిగింది. విజయ్ సేతుపతి నుంచి భవిష్యత్తులో రాబోయే మరిన్ని సినిమాలు కూడా ఓటీటి లోనే విడుదలబోతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో నిత్యామీనన్ కూడా నటిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలు ఓటీటి లో విడుదలవడంతో నిర్మాతలకు మంచి లాభాలు వస్తాయని నమ్మకంతో ఇలా చేస్తున్నారు.