నందమూరి కళ్యాణ్ రామ్ పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కించిన చిత్రం బింబి సార. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. ఈ సినిమా ఐదవ శతాబ్దానికి చెందిన బింబి సారుడు కథ అంశంగా తెరకెక్కించడం జరిగింది. ఇదే ఈ సినిమా ఈ రోజున బ్రహ్మాండంగా విడుదలైంది. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ ఈ సినిమా పైన భారీ అంచనాలను పెంచేశారు. ఈ ఫాంటసీ యాక్సిడెంట్ అయ్యే చిత్రాన్ని దర్శకత్వం వహించింది మల్లిడి వశిష్ట.


భారీ స్థాయిలో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా మెప్పించినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో చిత్ర బృందం చాలా సంతోషంగా ఉన్నట్లు సమాచారం. ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో అభిమానుల సాక్షిగా ఈ సినిమా నచ్చుతుందని మిమ్మల్ని నిరాశ పరిచేలా ఉండదని ఎన్టీఆర్ అభిమానులు కాలర్ ఎగరేసేలా ఉంటుంది అని ఎన్టీఆర్ స్టేట్ మెంట్ కి ఇవ్వడం జరిగింది. ఇక తన అన్న రిజల్ట్ రావడంతో ఎన్టీఆర్ ఆనందానికి కూడా అవధులు లేకుండా ఉన్నది.


దీంతో సోషల్ మీడియాలో వేదికగా ఎన్టీఆర్ చేసిన ట్వీట్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారుతున్నది. దాదాపుగా ఏడాదిన్నర సంవత్సరం తర్వాత కళ్యాణ్ రామ్ బింబి సార సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక దీంతో బింబి సార సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. మొదటిసారి చూస్తున్నప్పుడు మనం అనుభవించిన ఉత్సాహం ప్రజల సినిమాలు చూస్తున్నప్పుడు ఆస్వాదించినట్లుగా కలుగుతోంది అని తెలిపారు. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ అన్న నువ్వు తప్ప మరెవరు ఆ బింబి సారుని పాత్రని ఎవరు భర్తీ చేయలేరని ఎన్టీఆర్ తెలిపారు. డైరెక్టర్ వశిష్ట కూడా ఎంతో అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించారని. ఇక సంగీత దర్శకులు కీరవాణి కూడా బింబి సార సినిమాకు సంగీతాన్ని అందించి వెన్నుముకగా మారారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: