బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరో కూడా అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆయన సినిమాలలో హీరోలను చూపించే విధానం ఏ దర్శకుడు కూడా చూపించలేడు. మాస్ ప్రేక్షకులకు అత్యంత దగ్గర చేస్తూ ఆయన తన సినిమాలను రూపొందిస్తూ ఉంటాడు. అందుకే ఆయనకు మాస్ ప్రేక్షకులలో ఎక్కువగా ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఆయన బాలకృష్ణను తెరమీద చూపించే విధానానికి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోతారు.

వీరి కలయికలో వచ్చిన మూడు సినిమాలు కూడా భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించాయి. అఖండ లాంటి భారీ విజయం తర్వాత బోయపాటి శ్రీను ఇప్పుడు ఒక యంగ్ హీరోతో సినిమా చేయడం విశేషం. రామ్ హీరోగా ఆయన ఈ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమా యొక్క షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో హీరో ఏ విధంగా ఉంటాడో అన్న చర్చ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. 

అయితే బోయపాటి మాత్రం ఈ సినిమా లో హీరో ఎలా ఉండాలో అన్న విషయాన్ని రామ్ తో డిస్కస్ చేశాడట. ఈ సినిమాలోని హీరో పాత్ర కోసం రామ్ 10 కేజీల బరువు పెరగాలట. అంతేకాదు మేకోవర్ కూడా పూర్తిగా మార్చాలట. ఇప్పటికే బోయపాటి శ్రీను ప్రత్యేకంగా రామ్ మేకవర్ మార్చాలని చెప్పాడట. దాని కోసం కసరత్తులు చేస్తున్నాడట. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కాబోతుంది. ఇటీవలే రామ్ హీరోగా రూపొందిన ది వారియర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా ఆయనకు తప్పకుండా మంచి విజయాన్ని తెచ్చి పెట్టవలసిన సినిమాగా రూపొందుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: