ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో వారసులదే ఎక్కువగా హవా నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకప్పుడు ఇండస్ట్రీలో కొనసాగి స్టార్ హీరో హీరోయిన్లుగా హవా నడిపించిన వారు ఆ తర్వాత కాలంలో మాత్రం  సినిమాలకు దూరమైనప్పటికీ ఇక వారి పిల్లలను ఇక నట వారసులుగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉండటం చూస్తూ ఉన్నాం. ఇప్పటివరకు పెద్ద హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలకు ఇండస్ట్రీలో హీరోలుగా హీరోయిన్గా పరిచయం చేసిన వారు ఉన్నారు. అంతేకాదు ఇక ఎవరైనా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన పిల్లలు కాస్త పెద్ద అయ్యారు అంటే చాలు వారు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తారు అనే ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఒకప్పటి హీరోయిన్ లయ కూతురుపై కూడా ఇలాంటి టాక్ మొదలైంది.


 సాధారణంగా తెలుగమ్మాయిలకు ఇండస్ట్రీలో అవకాశాలు చాలా తక్కువ అనే టాక్ ఉంది.  ఇలాంటి సమయంలో విజయవాడకు చెందిన లయ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులందరికీ కూడా కట్టిపడేసింది. అయితే ఈమె కెరియర్ లో చేసింది కొన్ని సినిమాలు అయినప్పటికీ అభిమానులను మాత్రం తెగ ఆకర్షించేసింది అని చెప్పాలి. పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరమైన లయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు రీల్స్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇకపోతే ఇటీవలే తన కూతురు శ్లోక ఫోటో షేర్ చేసింది లయ.


 ఈ ఫోటో చూసి ప్రస్తుతం లయ అభిమానులు అందరూ కూడా షాక్ అవుతున్నారు. లయ కూతురు అచ్చం కుందనపు బొమ్మల ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమెకు అన్ని తల్లి పోలికలే వచ్చాయి అంటూ అంటున్నారు. ఈ క్రమంలోనే లయ కూతురు హీరోయిన్ మెటీరియల్ అంటూ నేటిజెన్లు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.  లయ తన కూతురిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది హీరోయిన్ల కంటే లాయా కూతురు అందం అభినయంలో ఒక మెట్టు పైనే ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి లయ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: