దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వం లో తాజాగా సీతా రామం అనే సినిమా తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని వైజయంతి మూవీస్ స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీ లో తరుణ్ భాస్కర్ ,  గౌతమ్ వాసుదేవ్ మీనన్ ,  సుమంత్ ,  భూమిక చావ్లా ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.  

రష్మిక మందన ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ ఆగస్టు 5 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ప్రేక్షకుల నుండి అద్భుతమైన టాక్ రావడంతో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూలు కూడా దక్కాయి. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం గా నిలిచింది. ఈ మూవీ ఇప్పటికే 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి కూడా వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది.

ఇది ఇలా ఉంటే సీతా రామం  మూవీ ప్రపంచ వ్యాప్తంగా 124 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను  వసూలు చేయగా ,  59 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ మొత్తం 46 కోట్ల లాభాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకుంది. ఇలా అద్భుతమైన లాభాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న సీతా రామం మూవీ ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ మూవీ లలో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ ద్వారా దుల్కర్ సల్మాన్ కి మృణాల్ ఠాగూర్ కి హను రాఘవపూడి కి గొప్ప గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: