కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించింది. ఓపెనింగ్ డే రోజు దాదాపు రూ.80 కోట్ల వరకు కలెక్షన్‌లు రాబట్టి రికార్డు సృష్టించింది.
దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 'పొన్నియన్ సెల్వన్-1' సెప్టెంబర్ 30న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించింది. ఓపెనింగ్ డే రోజు దాదాపు రూ.80 కోట్ల వరకు కలెక్షన్‌లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఫస్ట్ వీకెండ్‌లోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరి సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. మొదటి వారంలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల బాట పట్టింది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.400 కోట్లకు పైగా గ్రాస్‌ను.. రూ.200 కోట్లకు పైగా షేర్‌ను సాధించి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది.
లెజండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తమిళ సినీ చరిత్రలోనే నయా రికార్డులను సృష్టిస్తుంది. అయితే ఇప్పటివరకు ఈ చిత్రం కేవలం తమిళంలోనే బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. మిగిలిన అన్ని భాషల్లోనూ బ్రేక్ ఈవెన్‌కు దగ్గరలో ఉంది. తెలుగులో ఈ చిత్రానికి రూ.10 కోట్ల వరకు థియేట్రికల్ బిబినెస్ జరిగింది. కాగా రూ.10.50 కోట్లు వరకు సాధించాల్సి ఉంటుంది. అయితే తెలుగులో ఇప్పటివరకు ఈ చిత్రం రూ.8.50 కోట్లను సాధించింది. మరో రెండు కోట్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ పూర్తవుతుంది. అయితే ఇప్పటికే ఈ చిత్రం చాలా వరకు థియేటర్‌లలో నుండి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో రెండు కోట్లు సాధించడం అంటే కష్టమే అని చెప్పాలి. అదే విధంగా హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు దగ్గరలో ఉంది. మరి ఫైనల్ రన్‌లో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందో లేదో చూడాలి.
చియాన్ విక్రమ్, కార్తి, జయంరవి, త్రిష, ఐశ్వర్యరాయ్ వంటి భారీ తారగణంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మణిరత్నం కల్కి కృష్ణమూర్తి రాసిన 'పొన్నియన్ సెల్వన్' నవల ఆధారంగా తెరకెక్కించాడు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మ్రదాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. కాగా పోన్నియన్ సెల్వన్ రెండో భాగం వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల కానుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి